స్టార్ డైరెక్టర్ కి కోర్టు ఫైన్!

https://static.asianetnews.com/images/authors/74ce1d03-f84b-5b8e-abc1-c43c5f7c8632.jpg
First Published 4, Sep 2018, 12:29 PM IST
HC imposes Rs 10k as costs on filmmaker Shankar
Highlights

సౌత్ ఇండియా అగ్ర దర్శకుల్లో ఒకరైన శంకర్ పై ఇటీవల ఓ కేసు నమోదైన సంగతి తెలిసిందే. 2010 లో శంకర్ తెరకెక్కించిన 'ఎందిరన్' అనే సినిమా అప్పట్లో ఘన విజయం సాధించింది. 

సౌత్ ఇండియా అగ్ర దర్శకుల్లో ఒకరైన శంకర్ పై ఇటీవల ఓ కేసు నమోదైన సంగతి తెలిసిందే. 2010 లో శంకర్ తెరకెక్కించిన 'ఎందిరన్' అనే సినిమా అప్పట్లో ఘన విజయం సాధించింది. తెలుగులో 'రోబో' అనే పేరుతో ఈ సినిమా విడుదల రికార్డులు సృష్టించింది.

ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ ను రూపొందిస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే శంకర్ తెరకెక్కించిన ఎందిరన్ సినిమా కథ తనదంటూ రచయిత ఆరూర్ తమిళ్ నాథన్ చెన్నై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

అందులో శంకర్ తన కథను అపహరించినట్లుగా దీనికి ఆయన నష్టపరిహారం కింద కోటి రూపాయలను చెల్లించాల్సిందేనని పేర్కొన్నారు. ఈ పిటిషన్ పై పలుమార్లు విచారణ జరిగింది. శంకర్ కోర్టుకి హాజరై వివరణ ఇవ్వాల్సిందిగా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కానీ శంకర్ కోర్టుకి హాజరు కాలేదు. దీంతో కోర్టు అతడికి రూ.10 వేలు ఫైన్ విధిస్తూ విచారణనును సెప్టెంబర్ 12కి వాయిదా వేసింది.  

TODAY'S POLL

బిత్తిరి సత్తి శ్రీ ముఖిపై అతిగా కామెంట్ చేశాడా?

loader