హీరోగా గుర్తింపు తెచ్చుకోవడం కోసం కొందరు నటులు చాలా కష్టపడుతుంటారు.ఇండస్ట్రీలో అవకాశాల కోసం దర్శకులు, నిర్మాతల ఆఫీస్ ల చుట్టూ తిరుగుతుంటారు. బ్యాకప్ ఉంటే గనుక తమ సినిమాలను సొంతంగా నిర్మించుకుంటూ నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తుంటారు.

నటుడు హవీష్ ఇదే కోవలోకి వస్తాడు. గతంలో 'నువ్విలా', జీనియస్' వంటి చిత్రాల్లో నటించిన అతడికి సరైన గుర్తింపు దక్కలేదు. దీంతో హీరోగా తనను తాను నిరూపించుకోవడం కోసం సొంతంగా డబ్బు పెట్టి సినిమాలు తీస్తున్నాడు. డబ్బు ఇతడితే అయినప్పటికీ నిర్మాతగా మరొకరి పేరు పడుతుంటుంది.

రీసెంట్ గా ఈయన నటించిన '7' సినిమాకి సొంత డబ్బులే పెట్టుకున్నాడు. రిచ్ గా, క్వాలిటీతో తీద్దామనుకొని ఏకంగా పదకొండు కోట్లు ఖర్చు పెట్టాడు. ఇలాంటి సినిమాలను  నాలుగైదు కొట్లలో పూర్తి చేయొచ్చు కానీ హవీష్ మాత్రం అలా చేయలేదు.

ఇప్పుడు సినిమాకి వచ్చిన టాక్ చూస్తుంటే కనీసం ప్రమోషన్స్ కోసం ఖర్చు పెట్టిన మొత్తం కూడా వచ్చేలా కనిపించడం లేదు. దీంతో ఈ హీరోకి రూ.11 కోట్ల వరకు నష్టాలు వచ్చేలా ఉన్నాయి. డిజిటల్, శాటిలైట్ రైట్స్ తో కూడా పెద్దగా ఒరిగేదేమీ లేదు. మొత్తానికి హీరో కావాలని ఇంత ఖర్చుపెట్టి బోల్తా పడ్డాడు ఈ యువనటుడు.