Vaarasudu First single : ‘రంజితమే’ తెలుగు వెర్షన్ లో విన్నారా? అదిరిపోయిందిగా!
తమిళ స్టార్ విజయ్ తళపతి డైరెక్ట్ తెలుగులో నటిస్తున్న తాజా చిత్రం ‘వారసుడు’. స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న జంటగా నటిస్తోంది. చిత్రం నుంచి లేటేస్ట్ గా తెలుగు వెర్షన్ లో ఫస్ట్ సింగ్ ‘రంజితమే’ విడుదలైంది.

తమిళ స్టార్ హీరో విజయ్ (Vijay Thalapathy) తొలిసారిగా డైరెక్ట్ గా తెలుగులో నటిస్తున్న చిత్రం ‘వారసుడు’ (Varasudu). వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. చివరిగా ‘మహార్షి’తో బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకోవడంతో.. ఆ తర్వాత వస్తున్న ‘వారసుడు’పై గట్టిగానే అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రం బైలింగ్వుల్ గా రూపుదిద్దుకుంటోంది. తమిళంలో ‘వరిసు’గా విడుదల కాబోతోంది. ప్రస్తుతం తుదిదశ షూటింగ్ లో ఉన్న ఈ చిత్రం సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో మేకర్స్ క్రేజీ అప్డేట్స్ అందిస్తూ సినిమాపై ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేస్తున్నారు.
ఇప్పటికే మూవీ నుంచి ఫస్ట్ సింగ్ ను రిలీజ్ చేశారు. ‘రంజితమే’ అంటూ వచ్చిన రొమాంటిక్ సాంగ్ కు మంచి రెస్పాన్స్ దక్కింది. అయితే అప్పుడు కేవలం తమిళంలోనే రిలీజ్ చేశారు. తాజాగా తెలుగు వెర్షన్ లో Ranjithame సాంగ్ విడుదలైంది. తెలుగులో మరింతగా రెస్పాన్స్ వస్తోంది. కొద్దిసేపటి కింద విడుదలైన ఈ సాంగ్ కు లక్షల్లో వ్యూస్ దక్కుతున్నాయి. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీత అందిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ లిరికల్ వీడియోలో రష్మిక మందన్న, విజయ్ తళపతి స్టెప్పులు కూడా అదిరిపోయాయి.
‘రంజితమే’ సాంగ్ ను థమన్ సరికొత్త ట్యూనింగ్ చేశారు. రామజోగయ్య శాస్త్రి అదిరిపోయే లిరిక్స్ ను అందించారు. స్టార్ సింగర్ అనురాగ్ కులకర్ణి, ఎంఎం మానసి ఆలపించారు. టీ-సిరీస్ మ్యూజిక్ సంస్థ మ్యూజిక్ రైట్స్ ను దక్కించుకుంది. తెలుగు, తమిళం, హిందీలో రిలీజ్ కాబోతున్న ఈ చిత్రాన్ని శ్రీవెంకటేశ్వర క్రీయేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. శరత్ కుమార్, ప్రకాశ్ రాజ్, ఖుష్బు, స్నేహ, జయసుధ, యోగి బాబు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.