హీరోల అభిమానుల మధ్య వివాదాలు ఎక్కువగా తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలోనే చూస్తుంటాం. గత కొన్ని రోజులుగా ఇళయదళపతి విజయ్, తలా అజిత్ అభిమానుల మధ్య సోషల్ మీడియాలో యుద్ధం జరుగుతోంది. తరచుగా వీరిద్దరి అభిమానులు దూషణల పర్వం కొనసాగిస్తున్నారు. తాజాగా వీరి పిచ్చి అభిమానం హద్దులు దాటిన సంఘటన చోటు చేసుకుంది. 

హీరో విజయ్ చనిపోయాడంటూ అజిత్ అభిమానులు సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. #RIPactorVIJAY హ్యాష్ ట్యాగ్ ప్రస్తుతం ట్విట్టర్ లో ట్రెండింగ్ గా మారింది. ఈ హ్యాష్ ట్యాగ్ పై ఇప్పటికే 50 వేలకు పైగా ట్వీట్స్ నమోదయ్యాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. 

వరుస విజయాలతో దూసుపోతున్న ఈ ఇద్దరి హీరోల అభిమానుల మధ్య రోజు రోజుకు వైరం ముదురుతోంది. విజయ్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో బిగిల్ చిత్రంలో నటిస్తూ క్షేమంగా ఉన్నాడు. అజిత్ అభిమానులు పిచ్చి కోపాన్ని ఈ రకంగా ప్రదర్శిస్తున్నారు. 

గత కొన్నేళ్లుగా వరుస బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటున్న విజయ్ క్రేజ్ ఆకాశాన్ని తాకింది. రజని తర్వాత తమిళనాట అంతటి క్రేజ్ సొంతం చేసుకున్న హీరోగా విజయ్ వెలుగొందుతున్నాడు.