ఎంతో ఉత్కంఠను రేపిన తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ ఫైనల్ రిపోర్ట్ ఏమిటనేది మరికొన్ని క్షణాల్లో పూర్తిగా తెలియనుంది. ఫలితాలు ఎవరు ఊహించని విధంగా ఉంటాయని చివరి క్షణాల్లో అధికార పక్షానికి దెబ్బ పడనుందని టాక్ బాగానే వచ్చింది. అయితే లీడ్ లో టీఆరెస్ ఊహించని ఫలితాలనే అందుకుంటోంది. 

ఇక రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖులు ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా స్పందించడం స్టార్ట్ చేశారు. టాలీవుడ్ యువ దర్శకుడు షరీష్ శంకర్ కూడా ట్విట్టర్ ద్వారా తనదైన శైలిలో కామెంట్ చేశాడు. 11 నుంచి 11:30నిమిషాలకు క్లారిటీ వస్తుంది అన్నారు. కానీ ముందుగానే ఫలితాలేంటో తెలిసిపోయింది. పవర్ ఆఫ్ డెమొక్రసి అంటూ స్ట్రాంగ్ గా ట్వీట్ చేశారు.