ఒక భాషలో హిట్టైన సినిమాని రీమేక్ చేయమంటే చిన్న షాట్ మార్చటానికి కూడా ఇష్టపడరు కొందరు దర్శకులు. ఆ క్రమంలో నేటివిటీ అనేది లేకుండా పోతుంది. కానీ ఎమోషన్ పడితే సినిమాలు హిట్ అవుతూంటాయి. కానీ మరికొందరు దర్శకులు ఉంటారు. వారు ఒరిజనల్ ల్ లోని కీ కంటెంట్ ని తీసుకుని తనదైన శైలిలో ఒరిజనల్ లో మార్పులు చేసి హిట్ కొడుతూంటారు. అలాంటి వారిలో హరీష్ శంకర్ ఒకరు. 

సల్మాన్ ఖాన్ సూపర్ హిట్ దబాంగ్ ని తెలుగులో గబ్బర్ సింగ్ గా రీమేక్ చేసి సూపర్ హిట్ కొట్టిన ఘనత దర్శకుడు హరీష్ శంకర్ ది. వేరే భాషల్లో దబాంగ్ ని రీమేక్ చేసినా ప్లాఫ్ అయ్యాయి. కానీ తెలుగులో సూపర్ హిట్ అయ్యి మళ్లీ వేరే భాషల వాళ్లు రైట్స్ కొనుక్కునే స్దాయి వచ్చింది.  ఆ విషయం ప్రక్కన పెడితే ఇప్పుడు హరీష్ శంకర్ మరో చిత్రం రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

తమిళంలో సిద్దార్ద హీరోగా కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో  వచ్చిన 'జిగర్‌తండ'.  చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయటానికి రైట్స్ తీసుకుని వర్క్ చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏమిటీ అంటే 'జిగర్‌తండ' చిత్రాన్ని ఆల్రెడీ తెలుగులో 'చిక్కడు దొరకడు' టైటిల్ తో డబ్బింగ్ చేసి రిలీజ్ చేసారు.

 ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది. దాంతో ఇప్పుడీ చిత్రం రీమేక్ చేయాలనే హరీష్ శంకర్ ఆలోచనతో ఇండస్ట్రీవాళ్లు ఆలోచనలో పడ్డారు. 

అయితే హరీష్ శంకర్ ...జిగర్‌తండ చిత్రం తెలుగులో ఆడలేదు కాబట్టి ఎవరూ చూడలేదని ఫిక్స్ అయ్యే రీమేక్ చేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. ఇక ఈ చిత్రంలో నటించేది ఎవరు ఏంటి..అనే విషయం మాత్రం తెలియరాలేదు. 

 'జిగర్‌తండ' చిత్రం ..సిటీ బ్యాక్‌డ్రాప్‌లో ఒక యంగ్‌స్టర్‌ లైఫ్‌లో మొదలై   రౌడీషీటర్స్‌ ప్రపంచాన్ని టచ్‌ చేస్తూ, మంచి లవ్‌స్టోరీ, కామెడీ క్యారెక్టర్స్‌ మధ్య ట్రావెల్‌ అయి చిత్రమైన మలుపులు తిరుగుతూ చివరికి ఎవరూ ఊహించని క్లయిమాక్స్‌లో ఎండ్‌ అవుతుంది. ఆడియన్స్‌ ఒక కొత్త అనుభూతిని కలిగించే ఒక మ్యూజికల్‌ గ్యాంగ్‌స్టర్‌ లవ్‌స్టోరీగా తెరకెక్కించారు.