'బద్రి', 'తమ్ముడు' వంటి చిత్రాల్లో డాన్స్ చేసిన పవన్ కళ్యాణ్ ఆ తరువాత నుండి మాత్రం సినిమాలలో డాన్స్ చేయడం తగ్గించేశాడు. సాంగ్ అంటే సైలెంట్ గా అటు ఇటు నడుస్తూ సింపుల్ మేనరిజమ్స్ చేస్తూ మేనేజ్ చేసేవాడు. కానీ పవన్ అభిమానులు మాత్రం అతడు ఎప్పుడు డాన్స్ చేస్తాడా అని ఎదురుచూసేవారు.

ఇలా డాన్స్ కి గ్యాప్ ఇచ్చిన పవన్ తో 'గబ్బర్ సింగ్' సినిమాలో స్టెప్పులు వేయించాడు దర్శకుడు హరీష్ శంకర్. అయితే దానికోసం చాలా కష్టపడాల్సి వచ్చిందట. 'పిల్లా నువ్వు లేని జీవితం' పాట షూటింగ్ స్విట్జర్లాండ్ లో జరుగుతున్న సమయంలో పవన్ కి విపరీతమైన బ్యాక్ పెయిన్ వచ్చిందట. ఇక తన వల్ల కాదని హైదరాబాద్ వెళ్లి బ్యాలన్స్ ఉన్నది పూర్తి చేద్దామని పవన్ చెప్పారట.

అయినప్పటికీ హరీష్ శంకర్ ఆయన్ని విడిచి పెట్టలేదట. ''మీ డాన్స్ చూడాలని ఆడియన్స్ చచ్చిపోతున్నారు, చాలారోజుల నుంచి మీరు డాన్స్ చేయడంలేదు. స్టార్టింగ్ లో డాన్స్ రుచిచూపించి ఆపేశారు. మళ్లీ అలాంటి స్టెప్పులేయాల్సిందే. పైగా ఈ పాటకు స్టెప్పులు అవసరం. స్టెప్పులేయండి ప్లీజ్'' అంటూ పవన్ కాళ్ల మీద చేతులు వేసినట్లు హరీష్ శంకర్ చెప్పారు.

వెంటనే పవన్ తన చేతుల్ని తీసి.. నువ్వు డైరక్టర్ వి అలా చేయకూడదని.. వచ్చి స్టెప్పులేసినట్లు హరీష్ శంకర్ గుర్తు చేసుకున్నారు. అయితే డాన్స్ మాస్టర్ చెప్పినట్టు  చేయడానికి  పవన్ ఒప్పుకోలేదట.  డాన్స్ మూమెంట్ ఉండాలో అక్కడ మాత్రమే డాన్స్ చేశారని చెప్పుకొచ్చాడు హరీష్.