దర్శకుడు హరీష్ శంకర్ రూపొందించిన 'గద్దలకొండ గణేష్' సినిమా ఇటీవల విడుదలై సక్సెస్ అందుకుంది. వరుణ్ తేజ్ హీరోగా నటించిన ఈ సినిమా మాస్ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటుంది.

ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హరీష్ శంకర్  ఓ యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న హీరోలపై కొన్ని కామెంట్స్ చేశారు. ఎన్టీఆర్ సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అని.. షూటింగ్ 8 గంటలంటే పది నిమిషాల ముందే వచ్చేస్తారని చెప్పారు.

చిరంజీవి అంటే కింగ్ ఆఫ్ సినిమా అని.. ఇంకో చిరంజీవి పుడతారని అనుకోనని అన్నారు. పవన్ కళ్యాణ్ సినిమాలు చేయననటం తనకు నచ్చలేదని చెప్పారు. ఇక విజయ్ దేవరకొండ గురించి కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశారు. 

''అర్జున్ రెడ్డి' సినిమా తరువాత విజయ్ కి కథ చెప్పాలని ఒకసారి కలుద్దామని మెసేజ్ పెట్టాను. అన్నా.. నేను ఏడాదిన్నర, రెండేళ్ల వరకూ బిజీగా ఉన్నాను. సినిమా టాపిక్ కాకపోతే కలుద్దాం అని మెసేజ్ పెట్టాడు. సినిమా టాపిక్ కాకపోతే నీతో నాకేం పని ఉంటుందని భయ్యా.. ఏడాదిన్నర తరువాతే కలుద్దాం అని నేను రిప్లై ఇచ్చాను'' అంటూ 
చెప్పుకొచ్చాడు. 

విజయ్ దేవరకొండ విమర్శను చాలా సీరియస్ గా తీసుకుంటున్నాడని.. మన పని మనం చేసుకొని వెళిపోతే సరిపోద్ది అంటూ చెప్పుకొచ్చారు.