ఇండస్ట్రీలో రీమేక్ సినిమాలు చేయడం కష్టమని చెబుతుంటారు. ఆల్రెడీ ఒక భాషలో హిట్ అయిన సినిమాను మరో భాషలో తెరకెక్కించి హిట్కొట్టడం అంత ఈజీ కాదని అంటుంటారు. దీంతో చాలా మంది రీమేక్ చేయడానికి వెనుకడుగు వేస్తుంటారు. అయితే తన దృష్టిలో ప్రతీ సినిమా రీమేక్ అనే అంటున్నారు దర్శకుడు హరీష్ శంకర్.

గతంలో హరీష్ రీమేక్ సినిమాలు తీశాడు. తాజాగా మరోసారి రీమేక్ కథను ఎంచుకొని 'వాల్మీకి' సినిమా తీశాడు. తమిళంలో సక్సెస్ అయిన 'జిగార్తండా' సినిమాను తెలుగులో 'వాల్మీకి' పేరుతో తెరకెక్కించాడు. ఇప్పుడు ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉండడంతో సినిమా ప్రమోషన్స్ లో బిజీగా గడుపుతున్నాడు హరీష్ శంకర్.

ఈ క్రమంలో కొన్ని విషయాలను చెప్పుకొచ్చాడు. ప్రతీ సినిమా రీమేక్ అని.. ఒరిజినల్ అంటూ ఏదీ ఉండదని అంటున్నారు. ప్రతీ సినిమానూ ఏదొక కథ నుండో, నవల నుండో, సంఘటన నుండో స్ఫూర్తి పొంది రూపొందిస్తారు కాబట్టి ప్రతీదీ రీమేక్ అని ఆయన చెప్పుకొచ్చారు. రీమేక్ సినిమాలు చేసే ఒక్కో డైరెక్టర్ ఒక్కో థియరీ చెబుతుంటారు.

ఇప్పుడు హరీష్ శంకర్ కూడా ఓ కొత్త థియరీ చెబుతున్నారు. ఇక ఒరిజినల్ తమిళ వెర్షన్ తో పోలిస్తే తెలుగు వెర్షన్ లో భారీ మార్పులు లేవని హరీష్ శంకర్ అంటున్నారు. తెలుగు వెర్షన్ లో నితిన్, బ్రహ్మానందం, సుకుమార్ లుగెస్ట్ అప్పీరియన్స్ ఉంటుందని చెప్పారు.