ఇండస్ట్రీకు గబ్బర్ సింగ్ వంటి సూపర్ హిట్ ఇచ్చిన హరీష్ శంకర్ ఆ తర్వాత ఆ స్దాయి హిట్ మాత్రం ఇవ్వలేకపోయారు. కానీ వరసగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. తాజాగా వరుణ్ తేజ తో వాల్మీకి చిత్రం రూపొందిస్తున్నాడు.  తమిళ చిత్రం జిగర్తాండకు అఫీషియల్ రీమేక్ గా రెడీ అవుతున్న ఈ చిత్రం సెప్టెంబర్ 13న విడుదల కు రెడీ  అవుతోంది. ఈ నేపధ్యంలో ఆయన సోషల్ మీడియాలో తన అభిమానులతో మాట్లాడారు.

ఆ మాటల్లో భాగంగా హరీష్ శంకర్ తన తదుపరి చిత్రం విషయం నామ మాత్రంగా చెప్పారు. త్వరలోనే తాను రామ్ చరణ్ తో సినిమా చేయబోతున్నట్లు వెల్లడించారు. అందుకు స్క్రిప్టు రెడీ అయ్యిందని చెప్పాడు. కేవలం రామ్ చరణ్ కు మాత్రమే కాక, మహేష్ బాబు కు సైతం పవర్ ఫుల్ స్క్రిప్టు ఉందని అన్నాడు. అలాగే నాచురల్ స్టార్ నానితోనూ ఓ సినిమా చేసే అవకాసం ఉందన్నాడు.  

అలాగే బయిట మీడియా వార్తలు వచ్చినట్లుగా తాను చిరంజీవికి కథను నేరేట్ చేయలేదని అన్నారు. అయితే త్వరలోనే ఆ అవకాసం వస్తుందని, అందుకోసం వెయిట్ చేస్తున్నట్లు వివరించారు. ఏదైమైనా రామ్ చరణ్ తో హరీష్ శంకర్ సినిమా త్వరలో ఉండబోతోందని ఫ్యాన్స్ కు అర్దమైంది. వాళ్లు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

 ఇక వాల్మికి విషయానికి వస్తే...వ‌రుణ్ తేజ్‌,  హ‌రీష్ శంక‌ర్ క‌ల‌యిక‌లో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని 14 రీల్స్ ప్ల‌స్ బ్యాన‌ర్‌పై రామ్ ఆచంట‌, గోపి ఆచంట ఈ చిత్రాన్ని నిర్మించారు. వ‌రుణ్ తేజ్ గ్యాంగ్ స్ట‌ర్ పాత్ర‌లో న‌టిస్తుండ‌గా.. త‌మిళ హీరో అధ‌ర్వ ముర‌ళి కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. పూజా హెగ్డే, మృణాళిని ర‌వి హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. ప్ర‌స్తుతం సినిమా అన్ని హంగులు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది.  మిక్కి జే మేయర్ అందించిన సంగీతం అందిస్తున్న ఈ చిత్రం గబ్బర్ సింగ్ స్దాయి హిట్ వస్తుందని వరుణ్ తేజ అభిమానులు భావిస్తున్నారు.