హరీష్ శంకర్ ప్రస్తుతం తెరకెక్కిస్తున్న చిత్రం వాల్మీకి. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. అథర్వ, మృణాళిని, పూజా హెగ్డే ఈ చిత్రంలో నటిస్తున్నాడు. 14 రీల్స్ ప్లస్ నిర్మాణ సంస్థ తెరకెక్కించిన ఈ చిత్రం సెప్టెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంద. 

ఈ సందర్భంగా హరీష్ ప్రచార కార్యక్రమాల్లో బిజీ అయ్యారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో హరీష్ శంకర్ తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గబ్బర్ సింగ్ లాటి బ్లాక్ బస్టర్ తర్వాత హరీష్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో రామయ్యా వస్తావయ్యా చిత్రాన్ని తెరకెక్కించాడు. ఆ చిత్రాన్ని తీవ్రంగా నిరాశపరిచింది. 

తాను ఎవరికైనా రుణపడి ఉన్నానంటే అది ఎన్టీఆర్ కే. నాపై ఆయన ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయా. ఎప్పటికైనా ఆయనకు ఓ మంచి హిట్ ఇచ్చి రుణం తీర్చుకుంటా అని హరీష్ తెలిపాడు. ఇక నితిన్ నటించే బాలీవుడ్ రీమేక్ అంధాదున్ చిత్రాన్ని దర్శకత్వం వహించబోతున్నట్లు వస్తున్న వార్తలపై హరీష్ స్పందించాడు. 

నితిన్ నన్ను కలసి అంధాదున్ రీమేక్ లో నటించాలనుకుంటున్నట్లు తెలిపాడు. మంచి సినిమా నటించండి అని చెప్పాను. అంతకు మించి మా మధ్య ఇంకేమి చర్చలు జరగలేదు అని హరీష్ పేర్కొన్నాడు.