బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌లో వారాలు దగ్గరపడే కొద్ది సభ్యుల నిజ స్వరూపాలు బయటపడుతున్నాయి. సభ్యులు తగ్గే కొద్ది ఉత్కంఠ నెలకొంటుంది. తాజాగా సోమవారం నామినేషన్‌ ప్రక్రియలో పలు ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకున్నాయి. పన్నెండో వారానికి సంబంధించిన నామినేషన్‌ ప్రక్రియ విచిత్రంగా పెట్టాడు బిగ్‌బాస్‌. 

ఇప్పటి వరకు ఒకరినొకరు నామినేట్‌ చేసుకుంటూ వచ్చారు. కానీ ఈ సారి భిన్నంగా సాగింది. సభ్యులంతా పరిగెత్తి టోపీలను తమ తలపై పెట్టుకోగా, అందులో ఉన్న ఎరుపురంగు వాళ్ళు నామినేట్‌ అయినట్టు పేర్కొన్నారు. ఇందులో భాగంగా అభిజిత్‌, అరియానా, అఖిల్‌, అవినాష్‌లకు టోపీల్లో ఎరుపురంగు ఉండటంతో వాళ్లు ఈ వారానికి నామినేట్‌ అయ్యారు. మోనాల్‌, సోహైల్‌ ఆకుపట్ట రంగు రావడంతో సేవ్‌ అయ్యారు. ఇక కెప్టెన్‌ హారిక ఈ వారం నామినేషన్‌ నుంచి ఇమ్యూనిటీ పొందారు. 

ఈ నామినేషన్‌ ప్రక్రియలో సభ్యుల మధ్య ఉన్న బాండింగ్‌, అసలు స్వరూపం ఏంటో తెలిసిపోయింది. నిజమైన ఫ్రెండ్స్ ఎవరు అనేది క్లారిటీ వచ్చింది. అవినాష్‌ విషయంలో సోహైల్‌ సున్నితంగా తిరస్కరించగా, మోనాల్‌తో పెద్ద వాగ్వాదమే జరిగింది. అఖిల్‌.. మోనాల్‌ మధ్య రిలేషన్‌ ఈ నామినేషన్‌తో పటాపంచలయ్యింది. అఖిల్‌ని స్వాప్‌ చేసేందుకు మోనాల్‌ నిరాకరించింది. తన గేమ్‌ తాను ఆడుతానని నిర్మోహమాటంగా చెప్పింది. గేమ్‌ విషయంలో స్వతహాగా ఆడాలనే అఖిల్‌ సలహాని ఆయనకు తిరిగి కొట్టింది. దీంతో బిగ్‌బాస్‌ హౌజ్‌లో క్రేజీ లవ్‌ కపుల్‌గా ఉన్న వీరి మధ్య ఇప్పుడు ఏ బంధం లేదని తేటతెల్లమయిపోయింది. 

అరియానాకి కూడా సోహైల్‌, మోనాల్‌ సపోర్ట్ చేయలేదు. స్వాప్‌ చేసేందుకు ముందుకు రాలేదు. అభిజిత్‌ తాను స్వాప్‌ని కోరుకోలేదు. కానీ ఇందులో నిజమైన స్నేహితులెవరో తెలిసిపోయింది. ప్రేమలు పోయాయి. స్నేహం మిగిలిందనిపించింది. అఖిల్‌ కోసం స్వాప్‌ అవుతానని సోహైల్‌ వచ్చాడు, కానీ అఖిల్‌ దాన్ని తిరస్కరించాడు. అనంతరం అభిజిత్‌, హారికల మధ్య ఉన్న స్నేహాన్ని చాటిందీ ఎపిసోడ్‌. కెప్టెన్‌గా ఉన్న హారిక తన పవర్ ని ఉపయోగించి ఒకరిని స్వాప్‌ చేయండని బిగ్‌బాస్‌ చెప్పగా, హారికా..అభిజిత్‌కి మోనాల్‌తో స్వాప్‌ చేసింది. దీంతో తాను సేవ్‌ అయ్యానని ఎంతో కలలు కన్న మోనాల్‌ పెద్ద షాకే తగిలింది. మోనాల్‌ ఆశలపై బిగ్‌బాస్‌ నీళ్ళు చల్లారు. 

అభిజిత్‌, హారికల మధ్య ఉన్న స్నేహాన్ని చాటుకున్నారు. అయితే మోనాల్‌ని అవినాష్‌ ఓ రేంజ్‌లో ఆడుకున్నారు. మొదటి నుంచి ఏనాడు గేమ్‌ సరిగా ఆడలేదని చెప్పాడు. ఇప్పుడు ఆడేఅవకాశం వచ్చిందని, అందుకే నా గేమ్‌ నేను ఆడుతానని పేర్కొంది. అయితే ఇప్పటి వరకు ఆడలేదని ఒప్పుకుంటున్నావా? అని అవినాష్‌ ప్రశ్నించారు. దీనికి మోనాల్‌ సరైన విధంగా సమాధానం ఇవ్వలేకపోయింది. మొత్తానికి ఫ్రెండ్స్ ఎవరో ఈ వారంతో తేలిపోయిందని పేర్కొన్నారు.