'అరవింద సమేత' రిజల్ట్ తేడా కొడితే.. ఆ బ్యానర్ క్లోజంట!

https://static.asianetnews.com/images/authors/74ce1d03-f84b-5b8e-abc1-c43c5f7c8632.jpg
First Published 14, Sep 2018, 5:59 PM IST
harika hasini banner's future depends on aravinda sametha movie result
Highlights

హారిక హాసిని క్రియేషన్స్ అంటే వెంటనే గుర్తొచ్చేది దర్శకుడు త్రివిక్రమ్. ఆయన డైరెక్ట్ చేసే సినిమాలన్నీ కూడా ఇదే బ్యానర్ పై నిర్మిస్తుంటారు నిర్మాత రాధాకృష్ణ(చినబాబు). 

హారిక హాసిని క్రియేషన్స్ అంటే వెంటనే గుర్తొచ్చేది దర్శకుడు త్రివిక్రమ్. ఆయన డైరెక్ట్ చేసే సినిమాలన్నీ కూడా ఇదే బ్యానర్ పై నిర్మిస్తుంటారు నిర్మాత రాధాకృష్ణ(చినబాబు). త్రివిక్రమ్ రూపొందించిన 'సన్నాఫ్ సత్యమూర్తి', 'అ ఆ', 'అజ్ఞాతవాసి' వంటి సినిమాలను చినబాబు బాబు బ్యానర్ లో తెరకెక్కినవే.

ప్రస్తుతం ఇదే బ్యానర్ లో త్రివిక్రమ్ 'అరవింద సమేత' సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా రిజల్ట్ పైనే హారికా హాసిని క్రియేషన్స్ భవిష్యత్తు ఆధారపడి ఉందని టాక్. పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కించిన 'అజ్ఞాతవాసి' సినిమా దారుణంగా ఫ్లాప్ అవ్వడంతో ఆ ఎఫెక్ట్ నిర్మాతలపై బాగా పడింది.

ఆ నష్టాలను కవర్ చేయడానికే ఎన్టీఆర్ తో 'అరవింద సమేత' సినిమా చేస్తున్నారు. ఈ సినిమా హిట్ అయితే ఈ బ్యానర్ పై మరికొన్ని సినిమాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదే ఈ చిత్రం ఆశించిన ఫలితం ఇవ్వకపోతే గనుక తాత్కాలికంగా ఈ బ్యానర్ ని నిలిపివేయాలని నిర్ణయించుకున్నాడట నిర్మాత చినబాబు.

కొంతకాలం పాటు సినిమాల నుండి బ్రేక్ తీసుకొని కోలుకున్న తరువాత సినిమాలు చేద్దామని అనుకుంటున్నాడట. ఈ విషయం తెలిసిన ఆయన సన్నిహితులు సినిమా హిట్ అవుతుందని, ఆందోళన చెందకని ధైర్యం చెబుతున్నట్లు సమాచారం. 

loader