పవన్‌ కళ్యాణ్‌ నటిస్తున్న `హరిహర వీరమల్లు` మూవీ చాలా సార్లు వాయిదా పడుతూ వస్తోంది. ఇక ఇప్పుడు ఫైనల్‌ డేట్‌ కన్ఫమ్‌ అయ్యిందట. కాకపోతే విజయ్‌ దేవరకొండతో క్లాష్‌ తప్పేలా లేదు. 

పవన్‌ కళ్యాణ్‌ హీరోగా నటించిన `హరిహర వీరమల్లు` మూవీకి సంబంధించిన అప్‌ డేట్‌ రాబోతుంది. ఈ సినిమా రిలీజ్‌పై రేపు క్లారిటీ రానుంది. శనివారం చిత్ర బృందం అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. 

మరి ఏ రోజున ఈ మూవీ రిలీజ్‌ అవుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో తాజాగా వినిపిస్తున్న అప్‌ డేట్‌ క్రేజీగా ఉంది. సరికొత్త సస్పెన్స్ క్రియేట్‌ చేసేలా ఉంది.

`హరిహర వీరమల్లు` రిలీజ్‌ డేట్‌ విజయ్‌ దేవరకొండతో క్లాష్‌

`హరిహర వీరమల్లు` మూవీని జులై 24గానీ, జులై 25గానీ విడుదల చేసే అవకాశం ఉందట. మరికొన్ని గంటల్లో దీనిపై స్పష్టత రానుంది. ఒకవేళ ఇదే డేట్‌కి వస్తే ఇప్పుడు కొత్త చిక్కు వచ్చి పడుతుంది. 

అదే డేట్‌కి విజయ్‌ దేవరకొండ `కింగ్‌డమ్‌` మూవీని విడుదల చేయాలనుకుంటున్నారు. `కింగ్‌డమ్‌` మూవీ కూడా పలు మార్లు వాయిదా పడింది. జులై 4న విడుదల చేయాలని ప్రకటించారు. కానీ ఆ డేట్‌ కి రావడం లేదని తెలుస్తోంది. జులై 25న విడుదల చేయాలని భావిస్తున్నారట. 

ఈ క్రమంలో ఇప్పుడు అదే డేట్‌కి పవన్‌ `హరిహర వీరమల్లు` మూవీ రాబోతుందనే వార్త షాకిస్తుంది. విజయ్‌ మూవీని కూడా అదే సమయంలో తీసుకొస్తారా? మరోసారి దాన్ని కూడా వాయిదా వేస్తారా? అనేది చూడాలి.

`హరిహర వీరమల్లు`పై నెలకొన్న చిక్కులు సెటిల్‌ చేసే పనిలో టీమ్‌

నిజానికి `హరిహర వీరమల్లు` మూవీ చాలా సార్లు వాయిదా పడింది. షూటింగ్‌ పూర్తి కాకపోవడం వల్లే అనేక సార్లు వాయిదా పడుతూ వస్తోంది. చివరగా బిజినెస్‌ సెటిల్‌ కాక వాయిదా పడింది. 

ఓటీటీ డీల్‌లో వచ్చిన సమస్య, ఫైనాన్షియర్‌కి సెటిల్మెంట్‌, కొన్న బయ్యర్ల నుంచి ఒత్తిడి వంటి కారణాలతో ఈ మూవీని చివరి సారి వాయిదా వేశారు. ఇప్పుడు కూడా దీనికి సంబంధించిన టాక్స్ జరుగుతున్నాయట. కానీ చిత్ర బృందం మాత్రం విడుదల తేదీని ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. 

ఈ లోపు అన్నీ సెటిల్‌ చేసే పనిలో టీమ్‌ ఉన్నట్టు సమాచారం. మరి ఇది ఎంత వరకు సెట్‌ అవుతుందో చూడాలి. ఈ సారైనా ప్రకటించిన డేట్‌కి వస్తుందా? లేక మళ్లీ వాయిదా పడుతుందా అనేది చూడాలి.

`హరిహర వీరమల్లు`లో బందిపోటుగా పవన్‌ కళ్యాణ్‌

ఇక `హరిహర వీరమల్లు` చిత్రంలో పవన్‌ కళ్యాణ్‌ వీరమల్లుగా బందిపోటు పాత్రలో కనిపించబోతున్నారు. బాబీ డియోల్‌ ఔరంగా జేబ్‌గా నెగటివ్‌ షేడ్‌ ఉన్నపాత్రలో నటిస్తున్నారు. నిధి అగర్వాల్‌ పవన్‌కి జోడీగా చేస్తోంది. వీరితోపాటు పలువురు భారీ కాస్టింగ్‌ ఉన్నట్టు సమాచారం. 

ఇక విడుదలైన టీజర్లు, పాటలు ఆకట్టుకున్నాయి. సినిమా కోసం పవన్‌ ఫ్యాన్స్ వెయిటింగ్‌. కత్తికి, ధర్మానికి మధ్య యుద్ధం నేపథ్యంలో సాగే ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి. జ్యోతికృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఏఎం రత్నం భారీ బడ్జెట్‌తో నిర్మించిన విషయం తెలిసిందే.