పవన్ కళ్యాణ్ కెరీర్లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది హరి హర వీరమల్లు. కాగా ఈ మూవీ లేటెస్ట్ అప్డేట్ ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చింది. ఈ సినిమాలో హీరోయిన్ విషయంలో మార్పులు జరిగినట్లు వార్తలు వస్తున్నాయి.  

ఫ్యాన్స్ పాన్ ఇండియా మూవీ ఆశలు హరి హర వీరమల్లు(Hari Hara veeramallu) తో పవన్ తీర్చనున్నాడు. దర్శకుడు క్రిష్ పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కిస్తున్నారు. పవన్ కెరీర్ లో మొదటిసారి బందిపోటు పాత్ర చేస్తున్నారు. మొఘలుల కాలం నాటి కథలో పవన్ బందిపోటుగా కనిపించనున్నారు. పెద్దలను దోచి పేదలకు పెట్టే రాబిన్ హుడ్ తరహా రోల్ చేస్తున్నారు. ఈ మూవీ కోసం పవన్ (Pawan Kalyan) బాగా కష్టపడుతున్నారు. భారీ యాక్షన్ సన్నివేశాల్లో పాల్గొంటున్నారు. 

కాగా హరి హర వీరమల్లు మూవీలో నిధి అగర్వాల్, జాక్విలిన్ ఫెర్నాండెజ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. వీరిలో జాక్విలిన్ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆమె స్థానంలో మరో బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహిని తీసుకున్నారట. ఆమె త్వరలో హరి హర వీరమల్లు సెట్స్ లో జాయిన్ కానున్నారట. నోరా ఫతేహి (Nora Fatehi) హరి హర వీరమల్లు మూవీలో నటించడం అధికారికమే అని సమాచారం. ఆమె షాజహాన్ చెల్లి అయిన రోషనారా బేగం పాత్ర చేస్తున్నారట. 

అయితే జాక్విలిన్ (Jacqueline Fernandez) పాత్రను ఆమె భర్తీ చేశారా? లేక నోరా ఫతేహిని మరో కొత్త పాత్ర కోసం తీసుకున్నారా? అనే విషయంలో స్పష్టత లేదు. ఆమె నటించడం మాత్రం ఖాయమే. ఇక బాహుబలి మూవీలో నోరా ఫతేహి ఐటెం గర్ల్ గా కనిపించారు. మనోహరీ... సాంగ్ లో ఆమె ప్రభాస్ తో రొమాన్స్ చేశారు. ఆ పాటలో నటించిన ముగ్గురు హీరోయిన్స్ లో నోరా ఫతేహి ఒకరు కావడం విశేషం. ఈ సారి ఓ పూర్తి స్థాయి పాత్రలో తెలుగు ప్రేక్షకులను తన గ్లామర్ తో మైమరిపించనుంది. 

ఇక చాలా కాలంగా షూటింగ్ జరుపుకుంటున్న హరి హర వీరమల్లు విడుదల ఈ ఏడాది లేనట్లే. ఇప్పటి వరకు కేవలం 30 శాతం షూటింగ్ మాత్రమే కంప్లీట్ అయినట్లు సమాచారం. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా హరి హర వీరమల్లు విడుదలయ్యే అవకాశం కలదు. నిర్మాత ఏ ఎం రత్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.