‘హరిహర వీరమల్లు’ మేజర్ యాక్షన్ సీక్వెన్స్ పూర్తి .. అప్డేట్ ఇచ్చిన యాక్షన్ కొరియోగ్రాఫర్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘హరిహర వీరమల్లు’ నుంచి క్రేజీగా అప్డేట్ అందింది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుండగా.. తాజాగా యాక్షన్ సీక్వెన్ లో మేజర్ పార్ట్ పూర్తి చేశారని చిత్రయూనిట్ తెలిపింది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నటిస్తున్న తాజా చిత్రం ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu). దర్శకుడు క్రిష్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈపాటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా.. కరోనా పరిస్థితులు, పవన్ కళ్యాణ్ పొలిటికల్ ప్రోగ్రామ్స్ ద్వారా ఆలస్యం అవుతూ వచ్చింది. ఏట్టకేళకు గత నెల నుంచి రెగ్యూలర్ షూటింగ్ ను రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ లోనే వేసిన ఓ భారీ సెట్ లో కొనసాగిస్తున్నారు. ఇప్పటికే సెట్స్ నుంచి పవన్ కళ్యాణ్ బైక్ రైడ్ స్టిల్స్, ఫొటోలు లీక్ అవుతూ సినిమాపై అంచనాలను పెంచేస్తున్నారు.
ఈ సందర్భంగా చిత్రం నుంచి అప్డేట్స్ కోసం పవన్ అభిమానులు ఎంతగానో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా చిత్రర యూనిట్ నుంచి భారీ అప్డేట్ అందింది. ‘హరిహర వీరమల్లు’ కు యాక్షన్ కొరియోగ్రఫీని అందిస్తున్న విజయ్ తాజాగా అదిరిపోయే న్యూస్ చెప్పారు. సోషల్ మీడియాలో పవన్ తో ఉన్న రెండు ఫొటోలను పంచుకుంటూ అప్డేట్ అందించారు. ‘నిన్ననే మేజర్ యాక్షన్ సీక్వెల్స్ ను పూర్తి చేశాం. వెంటనే నెక్ట్స్ సీక్వెల్స్ ను ప్రారంభించేందుకు సిద్ధం అవుతున్నాం. రెగ్యూలర్ గా షూటింగ్ హాజరవుతూ కళ్యాణ్ బాబు మంచి సపోర్ట్ ను అందిస్తున్నారు. ఆయన ప్రశంసలు మరియు ప్రేమకు ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు.
ఇప్పటికే చిత్రం నుంచి వచ్చిన పోస్టర్లు, పవర్ గ్లాన్స్ కు అదిరిపోయే రెస్పాన్స్ దక్కిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఎలాంటి అప్డేట్ ను విడుదల చేయలేదు. దీంతో న్యూ ఇయర్ కు ముందే రీరిలీజ్ కానున్న ‘ఖుషి’చిత్రంతో ‘హరిహర వీరమల్లు’ అప్డేట్ ను అందించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక వచ్చే ఏడాది మార్చి కల్లా చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. రీసెంట్ సమాచారం ప్రకారం.. రిలీజ్ డేట్ ను కూడా ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది. 2023 మార్చి 22న విడుల చేసేందుకు షెడ్యూల్ చేస్తున్నారంట. దీనిపై ఇంకా అధికారిక ప్రటకన రావాల్సి ఉంది.
‘హరిహార వీరమల్లు’లో పనవ్ తిరుగుబాటు దారుడిగా కనిపించబోతున్నారు. 17వ శతాబ్దంలోని మొఘల్, కుతుబ్ షాహీల సామ్రాజ్యాల నేపథ్యంలో కథ సాగుతుంది. పవన్ కళ్యాణ్ సరసన తెలుగు బ్యూటీ నిధి అగర్వాల్ (Niddhi Agerwal) నటిస్తోంది. మెగాసూర్య ప్రొడక్షన్ బ్యానర్ పై నిర్మాత ఏఎం రత్నం నిర్మిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణీ మ్యూజిక్ అందిస్తున్నారు. చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో తెలుగు తో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీలోనూ గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.