పరిణితీ చొప్రా, హార్థిక్ పాండ్యా రిలేషన్ షిప్ పై రూమర్లు రూమర్లను కొట్టిపారేసిన హార్థిక్ తనకు పరిణితి గురించి అసలు తెలీదన్న హార్థిక్

ఇండియన్ క్రికెటర్ హార్థిక్ పాండ్యా.. బాలీవుడ్ నటి పరిణితి చోప్రా కి మధ్య ఉన్న రిలేషన్ గురించి క్లారిటీ ఇచ్చాడు. తనకు అసలు పరిణితీ గురించి పూర్తిగా తెలియను కూడా తెలీదని.. అలాంటప్పుడు రిలేషన్ ఎలాం ఉంటుందని ప్రశ్నించాడు.

వివరాల్లోకి వెళితే.. కొద్ది రోజుల క్రితం పరిణితీ చొప్రా.. తన ట్విట్టర్లో ఒక సైకిల్ ఫోటో పెట్టి..‘ అమేజింగ్ పార్టనర్ తో పరెఫెక్ట్ ట్రిప్.. లవ్ ఇన్ ద ఎయిర్’ అని ట్వీట్ చేసింది. దానికి హార్థిక్ .. ఆ పార్టనర్ ఎవరో నేను చెప్పనా.. నాకు తెలిసి అది మరో బాలీవుడ్, క్రికెట్ కి లింక్ ఉంది అంటూ ట్వీట్ చేశాడు. దానికి పరిణితీ.. కావచ్చు.. కాకపోవచ్చు.. ఆ ఫోటోలోనే ఉంది నా పార్టనర్ అదే సైకిల్ అని మరోమారు ట్వీట్ చేసింది.

వీరి ట్విట్టర్ సంభాషణ చూసినవారంతా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని..బాలీవుడ్, క్రికెట్ ఒక జంట కొహ్లీ, అనుష్క అయితే.. మరో జంట పరిణితీ, హార్థిక్ ది అంటూ చెప్పుకొచ్చారు. అయితే.. దీనిపై దీనిపై హార్థిక్ రిప్లై ఇచ్చాడు.

అన్ని తానే చేసినట్లు కనపడతానని.. కాకపోతే చివరకీ తాను ఏమి చేయనని హార్థిక్ చెప్పారు. ఇదంతా మార్కెటింగ్ గిమ్మిక్స్ అని ఆయన అభిప్రాయపడ్డారు.

 ‘నేను పార్టీలకు వెళ్లే వ్యక్తిలాగా కనపడుతున్నానా.. నేను ఎప్పుడూ నా గేమ్ గురించే ఆలోచిస్తూ ఉంటారు. ఈ రూమర్ వచ్చిన సమయంలో నేను శ్రీలంకలో ఉన్నాను. నాకు దీని గురించి ఏమీ తెలీదు. అసలు నాకు పరిణితీ చొప్రా గురించి ఏమీ తెలీదు. తనతో నాకు ఎలాంటి రిలేషన్లో లేను. కాకపోతే ఇలాంటి రూమర్లు నన్ను బాధపెట్టవు. పైగా సంతోషిస్తాను.’ అంటూ చెప్పుకొచ్చాడు.