మెగాడాటర్ నీహారిక కొణిదల ఓ హీరోతో ప్రేమలో ఉన్నట్లు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వినిపించాయి. ఇదే విషయమై ఆమెను ప్రశ్నించగా ఆమె సీరియస్ అయింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

యూట్యూబ్ ఛానెల్ కు చెందిన ఓ వ్యక్తి మీ పెళ్లెప్పుడు అని నీహారికను ప్రశ్నించగా.. నా పెళ్లి గురించి మీకెందుకు మీ థంబ్ నెయిల్స్ కోసం నన్ను వాడుకుంటారా అంటూ ఘాటుగా సమాధానమిచ్చింది.. ఆ తరువాత అతడు మేము అడుగుతుంది మీ హ్యాపీ వెడ్డింగ్ సినిమా గురించి అని అడగగా.. సారీ సారీ అంటూ నీహారిక ఈ సినిమా ట్రైలర్ జూన్ ౩౦న విడుదల కాబోతుందని, ఆరోజే సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తామని అన్నారు.

ఇదంతా కూడా హ్యాపీ వెడ్డింగ్ సినిమా ప్రమోషన్స్ కోసం చేసిన వీడియో. ఈ వీడియో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇన్నోవేటివ్ గా చిత్రీకరించిన ఈ ప్రోమో ఇప్పుడు వైరల్ అవుతోంది. సుమంత్ అశ్విన్, నీహారిక జంటగా నటించిన ఈ హ్యాపీ వెడ్డింగ్ యువి క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కుతోంది.