Asianet News TeluguAsianet News Telugu

కోరికలు కంట్రోల్‌ చేస్తే `హ్యాపీ ఎండింగ్‌`.. యాక్షన్‌, బోల్డ్ కంటెంట్‌తో `గేమ్‌ ఆన్‌`.. ట్రైలర్స్ అదుర్స్..

బాబా శాపం ఇస్తే, కోరికలు అతన్ని కంట్రోల్‌ చేస్తే ఏం జరిగిందో `హ్యాపీ ఎండింగ్‌` చూడాలి, అదే యాక్షన్‌తోపాటు రొమాన్స్, లిప్‌లాక్‌లు కావాలంటే `గేమ్‌ ఆన్‌` చూడాలి. ఈ ట్రైలర్లు ఇప్పుడు రచ్చ చేస్తున్నాయి. 
 

happy ending and game on movies trailers out with bold content arj
Author
First Published Jan 20, 2024, 11:09 PM IST

మనిషిలోని ఫీలింగ్స్, సెక్స్ అనే అంశాలపై తెలుగులో సినిమాలు చాలా తక్కువ. ఇండియాలోనే ఇలాంటి కంటెంట్‌తో చాలా అరుదుగా సినిమాలు వస్తుంటాయి. ఆడియెన్స్ వాటిని అంతగా ఎంకరేజ్‌ చేయకపోవడమే ప్రధాన కారణం. కానీ తాజాగా ఓ సాహసం చేస్తున్నారు `హ్యాపీ ఎండింగ్‌` మేకర్స్. బాబా శాపం ఇస్తే, కోరికలు కంట్రోల్‌ కాకపోతే, ఆ కోరికలకు తను ఎలా లొంగిపోయాడు అనే కాన్సెప్ట్ తో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ ట్రైలర్‌ని శనివారం విడుదలైంది. యూత్‌ఫుల్‌ కంటెంట్‌ని బోల్డ్ గా, ఫన్నీగా చెప్పారు. ట్రైలర్‌ ఆకట్టుకోవడంతోపాటు వైరల్‌గా మారింది. 

ఈ సందర్భంగా అతిథిగా విచ్చేసిన దర్శకుడు వేణు ఉడుగుల మాట్లాడుతూ, `హ్యాపీ ఎండింగ్` సినిమా ట్రైలర్ చూస్తుంటే ఇదొక న్యూ ఏజ్ మూవీ అనిపిస్తోంది. క్లాసిక్ అప్రోచ్ తో తెరకెక్కించారు. హీరో హీరోయిన్లు ఇద్దరు బాగా పర్ ఫార్మ్ చేశారు. పాటలు బాగున్నాయి. దర్శకుడు కౌశిక్ కు ఈ సినిమా మంచి పేరు తీసుకొస్తుంది. రైటర్ నాగసాయి నాకు బాగా పరిచయం. నాతో వర్క్ చేస్తున్నాడు. బాలీవుడ్ లో వికీ డోనర్ లా తెలుగులో "హ్యాపీ ఎండింగ్" మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నా` అని అన్నారు.

happy ending and game on movies trailers out with bold content arj

హీరో యష్ పూరి మాట్లాడుతూ - హీరోగా నేను చేస్తున్న రెండో సినిమా. ఈ ట్రైలర్ చూస్తే  కొంచెం అడల్ట్ కంటెంట్ ఉన్నట్లు అనిపించవచ్చు. కానీ సెన్సార్ అయ్యాక మాకు యు సర్టిఫికెట్ వస్తుందని ఆశిస్తున్నాను. మీరు మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో కలిసి నిరభ్యంతరంగా మా సినిమా చూడొచ్చు. ఈ సినిమాలో హర్ష్ కు కొన్ని మూఢనమ్మకాలు ఉంటాయి. నేను అలాంటివి నమ్మను. మాది చిన్న సినిమా కాదు మంచి సినిమా. మంచి కంటెంట్ ఉంటే మీరు తప్పకుండా ఆదరిస్తారు. "హ్యాపీ ఎండింగ్" అనే సినిమాకు నాలుగు ఫిల్లర్స్ గా నిలిచారు ఎడిటర్, సినిమాటోగ్రాఫర్, మ్యూజిక్ డైరెక్టర్, డైరెక్టర్. రేపు సినిమా రిలీజ్ అయ్యాక వచ్చే సక్సెస్ క్రెడిట్ వీళ్లకే ఇవ్వాలి. మీరంతా మా సినిమా చూసి మిగతా వారికి చెప్పాలి` అని అన్నారు.

డైరెక్టర్ కౌశిక్ భీమిడి మాట్లాడుతూ, `హ్యాపీ ఎండింగ్` ఒక హానెస్ట్ మూవీ. స్టార్ కాస్టింగ్ లేకున్నా మంచి సినిమా అయితే చాలు థియేటర్స్ కు వెళ్లి చూస్తాం అనుకునే ఆడియెన్స్ ను "హ్యాపీ ఎండింగ్" సంతృప్తి పరుస్తుంది. నాకు మైథాలజీ ఇష్టం. మహాభారతం చదువుతున్నప్పుడు అందులో అనేక శాపాల గురించి ఉంటుంది. అలా ఒక శాపం హీరోకు ఉంటే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ తో మోడ్రన్ అప్రోచ్ తో చేసిన సినిమా ఇది. "హ్యాపీ ఎండింగ్" సినిమాతో మిమ్మల్ని ఎంటర్ టైన్ చేసే అవకాశం ఇస్తారని కోరుకుంటున్నాం` అని చెప్పారు. ఈ చిత్రంలో అపూర్వ రావ్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ చిత్రాన్ని హమ్స్ టెక్ ఫిలింస్, సిల్లీ మాంక్స్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. యోగేష్ కుమార్, సంజయ్ రెడ్డి, అనిల్ పల్లాల నిర్మాతలు. కౌశిక్ భీమిడి దర్శకత్వం వహించారు. ఇది ఫిబ్రవరి 2న విడుదల కాబోతుంది. 

రొమాన్స్, లిప్‌ లాక్‌లతో `గేమ్‌ ఆన్‌` ట్రైలర్‌..  

గీతానంద్, నేహా సోలంకి జంట‌గా న‌టించిన చిత్రం  ‘గేమ్ ఆన్‌’. సీనియర్ నటులు మధుబాల, ఆదిత్య మీనన్ శుభలేఖ సుధాకర్ కీలక పాత్రలు పోషించారు. క‌స్తూరి క్రియేష‌న్స్ అండ్  గోల్డెన్ వింగ్ ప్రొడ‌క్ష‌న్స్‌ బ్యాన‌ర్స్‌పై ద‌యానంద్  ద‌ర్శ‌క‌త్వంలో ర‌వి క‌స్తూరి ఈ సినిమాను నిర్మించారు. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్ర‌వ‌రి 2న గ్రాండ్ గా విడుద‌ల‌కు సిద్ద‌మ‌వుతోంది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాదులో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను నిర్వహించారు. తాజాగా విడుదలైన ట్రైలర్‌ యాక్షన్‌, బోల్డ్ సీన్లు, రొమాన్స్ సీన్లు ఓవర్ డోస్‌లో ఉన్నాయి. యూత్‌ని మరింతగా టార్గెట్‌ చేసినట్టు ఉంది. 

ఈ సందర్భంగా దర్శకుడు దయానంద్‌ మాట్లాడుతూ , కమర్షియల్ స్క్రిప్ట్ ని రా అండ్ రస్టిక్ గా చిత్రీకరించాను. పూరి జగన్నాథ్ ఫ్యాన్ గా ఈ సినిమాను డైరెక్ట్ చేశాను. ఈ చిత్రంలో పాత్రలన్నీ గ్రే షేడ్‌లో ఉంటాయి. ప్రతి పాత్రకు ప్రాధాన్యం ఉంటుంది. తన జీవితాన్ని చాలించాలనుకునే ఓ వ్యక్తి ,రియల్‌ టైమ్ సైక‌లాజిక‌ల్ గేమ్‌లోకి ఎలా ప్రవేశించాడు? గేమ్‌లోని టాస్క్‌ను ఎలా స్వీకరించాడు? అసలు ఆ గేమ్‌ ఎంచుకోబడడానికి కారణం ఏమిటి? ఈ గేమ్‌ ఎవరు ఆడిస్తున్నారు? అనే అంశాలతో ‘గేమ్ ఆన్’ సినిమా తెరకెక్కింది. యాక్ష‌న్‌, రొమాన్స్,  ఎమోష‌న్స్ ఆక‌ట్టుకుంటాయి. క‌చ్చితంగా మా సినిమా ప్రేక్ష‌కుల‌కు కొత్త ఎక్స్ పీరియ‌న్స్ ఇస్తుంది. ఈ జర్నీలో చాలా ఛాలెంజెస్ ఫేస్ చేసాం. రెగ్యులర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కాకపోయినా ఫ్యామిలీ డార్క్ ఎమోషన్స్ ఉంటాయి` అని తెలిపారు.   

happy ending and game on movies trailers out with bold content arj

గీతానంద్ మాట్లాడుతూ, `ట్రైలర్ లో చూసింది 10% మాత్రమే.  ఈ సినిమా కోసం చాలా రీసెర్చ్ చేశాం.  మంచి కాన్సెప్ట్ రాసుకుని దానికి కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించాం.  ఇదొక హై ఆక్టేన్ యాక్షన్ డ్రామా. గేమింగ్ కంపెనీలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ గా పని చేసే ఒక ఎంప్లాయ్ జీవితంపై విరక్తి చెంది ఒక గేమ్ లో పడితే ఎలా ఉంటుందనేది ఈ సినిమాలో ఆసక్తికరంగా చూపించాం. మధుబాల గారు ఆదిత్య మీనన్ గారు ఇందులో ఉండడం ఈ సినిమా  నెక్స్ట్ లెవెల్ కు వెళ్లింది. గేమ్ స్టార్ట్ చేసాం . మా గేమ్ ను ప్రేక్షకులే గెలిపించాలి.  ఈ సినిమా తర్వాత మా తమ్ముడైన డైరెక్టర్ దయానంద్ యాక్షన్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకుంటాడు.  నేను కూడా నటుడుగా పేరు తెచ్చుకోవాలని ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాను" అని చెప్పారు.  

ఈ సంద‌ర్భంగా నిర్మాత ర‌వి క‌స్తూరి  మాట్లాడుతూ, ఇది నా ఫస్ట్ ప్రాజెక్ట్. నేను ఆస్ట్రేలియాలో ఉంటాను. గీతానంద్ నా క్లాస్మేట్.  ఏదో ఒక రోజు సినిమా తీద్దామని అనుకున్నాం.  మంచి కథతో ఈ సినిమాను స్టార్ట్ చేసాం. ఎక్కడ  కాంప్రమైజ్ కాకుండా దీన్ని రూపొందించాం.  ప్రతి విషయంలో క్వాలిటీ ఉండేలా చూసుకున్నాం. ప్రేక్షకులను ఎంగేజ్ చేసేలా సినిమా ఉంటుంది. నవాబ్ గ్యాంగ్స్ అద్భుతమైన పాటలు ఇచ్చారు అవి అందర్నీ ఆకట్టుకునేలా ఉంటాయి. ఇలాంటి కథ ఇప్పటివరకు తెలుగు తెరపై రాలేదు". అని చెప్పారు. ఈ మూవీ కూడా ఫిబ్రవరి 2న విడుదల కాబోతుంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios