Asianet News TeluguAsianet News Telugu

ఆదిపురుష్ డైరెక్టర్ కు తలనొప్పిగా మారిన హనుమాన్ సక్సెస్.. ఓం రౌత్ ను ఆడేసుకుంటున్న నెటిజన్లు..

పాపం ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు.. తాజాగా హిట్ కొట్టిన హనుమాన్ మూవీ సక్సెస్.. లాస్ట్ ఇయర్ రిలీజ్ అయ్యి ప్లాప్ అయిన ఆదిపురుష్ డైరెక్టర్ తలకు చుట్టుకుంది. నెటిజన్లు ఓం రౌత్ ను ఓ ఆట ఆడేసుకుంటున్నారు. 
 

Hanuman Success Adipurush Director Om Raut Being Trolled Big Time JMS
Author
First Published Jan 13, 2024, 3:26 PM IST

పాపం ఓం రౌత్ భారీ బడ్జెట్ తో ప్రభాస్ లాంటి భారీ ఇమేజ్ ఉన్న హీరోను.. భారీ గ్రాఫిక్స్ ఉపయోగించి.. భారీ స్థాయిలో   సినిమా చేశాడు. కాని బాక్సాఫీస్ దగ్గర భారీగానేబోల్తా కొట్టాడు. దాంతో అప్పటి నుంచి టైమ్ దొరికినప్పుడల్లా.. నెటిజన్లు ఆడేసుకుంటున్నారు. ఆదిపురుషుకంటే తక్కువ  బడ్జెట్ తో.. గ్రాఫిక్స్ వాడి  ఏ సినిమా వచ్చినా.. ఓం రౌత్‌పై పడిపోతున్నారు అభిమానులు. అకేషన్ దొరికితే చాలు అటూ ఇటూ వాయించేస్తున్నారు పాపం. ఇదంతా చూసాక అనవసరంగా ఆదిపురుష్ చేసానేమో అని ఔం రౌత్ బాగా ఫీల్ అయ్యుంటాడేమో అనిపిస్తుంది చూసేవారికి. 

ఆకరికి యూ ట్యూబ్‌లో  బెస్ట్ గ్రాఫిక్ షాట్ ఏదైనా దొరికితే.. అది కూడా వదలకుండా . వెంటనే ఓం రౌత్‌ను ట్యాగ్ చేస్తూ నరకం చూపించేస్తున్నారు. ఇక ఇప్పుడు ఏకంగా హనుమాన్ సినిమా వచ్చింది. అందులో గ్రాఫిక్స్ అదిరిపోయాయి.. ఔట్ పుట్ మామూలుగా లేదు.. ముఖ్యంగా ప్రశాంత్ వర్మ టేకింగ్‌కు ఫిదా అయిపోతున్నారంతా.అసలు ఇలా కదా ఓ సినిమా తీయాల్సింది.. ఏం తీసాడురా బాబూ.. ఆ మేకింగ్‌కు సలాం చెప్పాల్సిందే అంటూ ప్రశాంత్ వర్మపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అదే సమయంలో ఓం రౌత్‌ను ఓ ఆటాడుకుంటున్నారు. ఓం కమ్ టూ మై రూమ్ అంటూ రచ్చ రచ్చ చేసి పారేస్తున్నారు. 

హనుమాన్ సినిమాకు మేకర్స్ పెట్టిన ఖర్చు మహా అయితే 25 కోట్లు దాటదు. నిర్మాత 50 కోట్లకు పైగా లెక్కలు చెప్తున్నాడు కానీ దర్శకుడు చెప్పిన లెక్క మాత్రం పాతిక కోట్ల లోపే. కానీ ఆ సినిమా ఔట్ పుట్ మాత్రం 200 కోట్ల సినిమాకు పైగానే అనిపిస్తుంది. అసలు పాతిక కోట్లతో ఈ రేంజ్ ఔట్ పుట్ ఎలా ఇచ్చాడనేది ఎవరికీ అర్థం కాని విషయం. ఆ క్వాలిటీని చూస్తుంటే మతులు చెడిపోతున్నాయి. థియేటర్స్ అన్నీ జై హనుమాన్, జై శ్రీరామ్ నినాదాలతో మార్మోగిపోతున్నాయి. ఈ విషయంలో డైరెక్టర్  ప్రశాంత్ వర్మ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆయన నుంచి చాలా నేర్చుకోవాలని అంటున్నారు. 

అసలు ఇలా కదా ఓ సినిమా తీయాల్సింది.. ఏం తీసాడురా బాబూ.. ఆ మేకింగ్‌కు సలాం చెప్పాల్సిందే అంటూ ప్రశాంత్ వర్మపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అదే సమయంలో ఓం రౌత్‌ను ఓ ఆటాడుకుంటున్నారు. ఓం కమ్ టూ మై రూమ్ అంటూ రచ్చ రచ్చ చేసి పారేస్తున్నారు. హనుమాన్ సినిమాకు మేకర్స్ పెట్టిన ఖర్చు మహా అయితే 25 కోట్లు దాటదు. నిర్మాత 50 కోట్లకు పైగా లెక్కలు చెప్తున్నాడు కానీ దర్శకుడు చెప్పిన లెక్క మాత్రం పాతిక కోట్ల లోపే. కానీ ఆ సినిమా ఔట్ పుట్ మాత్రం 200 కోట్ల సినిమాకు పైగానే అనిపిస్తుంది. అసలు పాతిక కోట్లతో ఈ రేంజ్ ఔట్ పుట్ ఎలా ఇచ్చాడనేది ఎవరికీ అర్థం కాని విషయం. ఆ క్వాలిటీని చూస్తుంటే మతులు చెడిపోతున్నాయి. థియేటర్స్ అన్నీ జై హనుమాన్, జై శ్రీరామ్ నినాదాలతో మార్మోగిపోతున్నాయి. ఈ విషయంలో దర్శకులు అంతా ప్రశాంత్ వర్మ నుంచి చాలా నేర్చుకోవాలని నెటిజన్లు చెప్తున్నారు.
ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో హనుమాన్ మూవీ ఒక్క ఓం రౌత్ కే కాదు.. చాలా మంది స్టార్ మేకర్స్  క్వాలిటీ, విజువల్ ఎఫెక్ట్స్ పేరుతో వందల కోట్లు స్వాహా చేస్తున్నారు. కానీ ప్రశాంత్ వర్మ మాత్రం ఇంత తక్కువ బడ్జెట్ లో హనుమాన్ లాంటి క్వాలిటీమూవీని ఇచ్చాడు.  ఇప్పుడు హనుమాన్ ఎఫెక్ట్ అందరికంటే ఎక్కువగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్‌పైనే పడుతుంది. ఎందుకంటే గతేడాది ఈయన తెరకెక్కించిన ఆదిపురుష్‌ సినిమాపై ఎన్ని విమర్శలు వచ్చాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కంటెంట్ పోతే ఎవరూ ఏమనరు కానీ విజువల్ ఎఫెక్ట్స్ అత్యంత దారుణంగా ఉంటాయి ఈ చిత్రంలో. 

అసలు 300 కోట్లకు పైగా ఖర్చు పెట్టించి ఏం తీసాడు అనే చర్చే ఎక్కువ రోజులు జరిగింది. ఇప్పుడు అందులో పదోవంతు కూడా బడ్జెట్ కూడా పెట్టకుండా హనుమాన్ ఔట్ పుట్ ఇచ్చాడు ప్రశాంత్ వర్మ. దాంతో సినిమా అంటే ఇలా తీయాలి అంటూ ఓం రౌత్‌ను ఆడుకుంటున్నారు అభిమానులు. ఇది కేవలం ఇక్కడితో ఆగలేదు. మొన్న సలార్ విడుదలైనపుడు కూడా ప్రభాస్‌ను వాడుకునే పద్దతి ఇది అంటూ ఓం రౌత్‌ను ఆడుకున్నారు అభిమానులు. 

Follow Us:
Download App:
  • android
  • ios