Asianet News TeluguAsianet News Telugu

#Hanuman కటౌట్ రోడ్డుపై పడేసారా?మైత్రీ కే అన్యాయం?

 హీరో కటౌట్ అలా పడేస్తే ఈ పాటికి గొడవలు జరిగేవని, దేవుడు కాబట్టి అది కటౌట్ మాత్రమే అని అంటున్నారని మరికొందరు చెప్తున్నారు. ఏదైమైనా ఈ ఫొటో న్యూస్ వైరల్ అవుతోంది. 

Hanuman Nizam Mythri Movies are absolutely frustrated jsp
Author
First Published Jan 11, 2024, 12:33 PM IST


హనుమాన్ సినిమా వివాదం ట్విట్టర్ సాక్షిగా రోడ్డు కెక్కుతోంది.  ఈ సినిమాకు థియేటర్స్ కేటాయించలేదని,కేటాయించినవి కూడా లాగేసుకున్నారని ఇప్పటికే రకరకాల కామెంట్స్ మీడియాలో వినిపిస్తున్నాయి. మైత్రీ వంటి పెద్ద సంస్ద నైజాంలో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నా ఇలాంటి పరిస్దితి ఎదుర్కోవాల్సి వచ్చిందని మరికొందరు సానుభూతి చూపెడుతున్నారు. ఈ నేపధ్యంలో ఓ ఫొటో ఒకటి సోషల్ మీడియా ద్వారా బయిటకు వచ్చింది. హనుమాన్ కటౌట్ ని థియేటర్ దగ్గర పెట్టమని పంపతే రోడ్డుపై పడేసారంటూ చెప్తున్నారు.

 దేవుడి కట్ అవుట్ అయినా బయిటపడేయించారనేది ఆ ఫోటో పెడుతూ చేస్తున్నా కామెంట్. అయితే లోపలే గోడకు ఆన్చి పెట్టారని మరికొందరు అంటున్నారు. ఈ కొత్త రచ్చపై సోషల్ మీడియాలో ఓ రేంజి డిస్కషన్ జరుగుతోంది. అదే హీరో కటౌట్ అలా పడేస్తే ఈ పాటికి గొడవలు జరిగేవని, దేవుడు కాబట్టి అది కటౌట్ మాత్రమే అని అంటున్నారని మరికొందరు చెప్తున్నారు. ఏదైమైనా ఈ ఫొటో న్యూస్ వైరల్ అవుతోంది. 

మరో ప్రక్క #Hanuman సలార్ తో పాటు హనుమాన్ కు అగ్రిమెంట్ చేసుకున్న థియేటర్లను శిరీష్ క్యాన్సిల్ చేయించారు. ఇది ఎక్కడి పద్దతి - మైత్రీ వాళ్లు అంటూంటే...మైత్రీ డిస్ట్రిబ్యూటర్లు సింపతీ కోసం ట్రయ్ చేస్తున్నారు. డిస్కషన్ కు రమ్మంటే రావడం లేదు..సింగిల్ స్క్రీన్ లు కావాలంటే ఎక్కడి నుంచి తెస్తాము -...ఆసియన్ సునీల్ చెప్తున్నట్లు తెలుస్తోంది. 
 
ఏదైమైనా రేపు  విడుదలైనా ఈ రోజు  సాయంత్రమే భారీ ప్రీమియర్లు ప్లాన్ చేసుకున్న హనుమాన్ టీమ్ కి ఊహించని స్థాయిలో స్పందన దక్కుతోంది. మొదట కొన్ని సెంటర్లలో షోలు వేయాలనుకున్నా పబ్లిక్ నుంచి అనూహ్యమైన డిమాండ్ రావడంతో ఎక్కడిక్కడ పెంచుకుంటూ పోవాల్సిన పరిస్థితి తలెత్తింది. ఒక్క హైదరాబాద్ లోనే కాదు గుంటూరు, విజయవాడ, రాజమండ్రి ఎక్కడ చూసినా ఇదే సీన్. రెండు షోలు చాలనుకున్న చోట ఇప్పుడు కనీసం ఆరు దాకా వేస్తున్నారు. నైట్ షోలకు డిమాండ్ పెరుగుతోంది. కరెంట్ బుకింగ్ అవసరం లేకుండానే ఆన్ లైన్లో సోల్డ్ అవుట్స్ పడుతున్నాయి.
  
 ఈ మూవీలో హీరోయిన్‌గా అమృతా అయ్యర్ నటించింది. వరలక్ష్మి శరత్‌కుమార్ మరో కీలక పాత్ర పోషించింది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలయిన టీజర్, ట్రైలర్, పోస్టర్స్.. అన్నీ ఈ జోనర్ సినిమాలు ఇష్టపడేవారిని విపరీతంగా ఆకట్టుకున్నాయి. పైగా తెలుగులో మాత్రమే కాదు.. ‘హనుమాన్’ను పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల చేస్తున్నారు కాబట్టి ఇతర భాషల్లో కూడా ప్రమోషన్స్ భారీగానే జరుగుతున్నాయి. ఫైనల్‌గా  సంక్రాంతికి ‘గుంటూరు కారం’ వర్సెస్ ‘హనుమాన్’ పోటీ తప్పదని అర్థమవుతోంది.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios