తేజా సజ్జా - ప్రశాంత్ వర్మ కాంబోలో వచ్చిన సూపర్ హీరో ఫిల్మ్ ‘హను-మాన్’ HanuMan కు మంచి రెస్పాన్స్ దక్కుతోంది. ఈ సందర్భంగా మూవీ యూనిట్ కీలక నిర్ణయం తీసుకుంది.
యంగ్ హీరో తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prashanth Varma) దర్శకత్వంలో రూపొందించిన చిత్రం `హనుమాన్`. సూపర్ హీరో ఫిల్మ్ గా ఈరోజు శుక్రవారం(జనవరి 12న) గ్రాండ్ గా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం ప్రమోషన్స్ తోనే హైప్ పెంచేసింది. అందులోనూ సూపర్ స్టార్ మహేశ్ బాబు Mahesh Babu సినిమా ‘గుంటూరు కారం’తోనూ కలిసి థియేటర్లలోకి వచ్చింది.
అయితే, ప్రేక్షకులు మాత్రం ఈరోజు విడుదలైన చిత్రాల్లో ‘హనుమాన్’కు మాత్రమే ఓటేస్తున్నారు. పలు సంస్థలు కూడా ఈ చిత్రానికే మంచి రేటింగ్ ను అందిస్తున్నాయి. దీంతో సినిమా సక్సెస్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇప్పటికే మౌత్ పబ్లిసిటీ జోరుగా కొనసాగుతోంది. మూవీ యూనిట్ చాలా సంతోషిస్తోంది. ఈక్రమంలో మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
‘హనుమాన్’ సక్సెస్ కావడంతో అయోధ్య రామమందిరానికి Ayodhya Ram Mandir విరాళం ప్రకటించారు. మునుపు టిక్కెట్ పై రూ.5 డొనేట్ చేస్తామని ప్రకటించారు. తాజాగా పెయిడ్ ప్రీమియర్స్ ద్వారా వచ్చిన కలెక్షన్ లో రూ.14.25 లక్షలు విరాళంగా ఇస్తున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లోని ఫిల్మ్ నగర్ లో గల హనుమాన్ టెంపుల్ లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారిని దర్శనం చేసుకున్నారు.