ప్రశాంత్ వర్మ పై హనుమాన్ హిట్టు ప్రభావం.. కోరికలు తీర్చుకుంటున్న దర్శకుడు
అనుకున్నదానికంటే డబుల్ సక్సెస్ ను.. సంతోషాన్ని సొంతం చేసుకున్నాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. హనుమాన్ మూవీతో పాన్ ఇండియా రేంజ్ లో అద్భుతం సాధించాడు. ఈసంతోషాన్న గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు.
హనుమాన్ మూవీతో అనుకోని సంతోషాలు తన జీవితంలో వచ్చాయన్నారు ప్రశాంత్ వర్మ. ఈసినిమా తను అనుకున్నదాని కంటే కూడా డబుల్ రిజల్ట్ ను అందించడంతో సంతోషంలో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. అటు తేజ సర్జకు కూడా హానుమాన్ మూవీతో మంచి బ్రేక్ రావడంతో.. టీమ్అంతా హ్యాపీగా ఉన్నారు. అప్పటి వరకూ చిన్న హీరో.. చిన్న డైరెక్టర్ అనిపించుకున్న వారు.. ప్రస్తుతం స్టార్ ఇమేజ్ తో దూసుకుపోతున్నారు. అటు దర్శకుడు ప్రశాంత్ వర్మకు.. ఇటు తేజా సర్జకు వరుస ఆఫర్లు ఇంటిముందుకు వచ్చినిలబడుతున్నాయని సమాచారం.
లెటెస్ట్ సెన్సేషన్ గా నిలిచాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. హనుమాన్ మూవీ భారీగా కలెక్ట్ చేయడంతో.. సంతోషంలో తేలిపోతున్నాడట. అంతే కాదు రీసెంట్ గా ఓలగ్జరీ కారును కూడా ప్రశాంత్ వర్మ బుక్ చేశారట. దాని విలువ 6 కోట్ల వరకూ ఉండొచ్చంటున్నారు. ఎప్పటినుంచో ఉన్న తన కోరికను హనుమాన్ మూవీ సక్సెస్ తో తీర్చుకుంటున్నాట ప్రశాంత్ వర్మ.
తేజ సజ్జా హీరోగా హనుమాన్ బ్యాక్ డ్రాప్ లో.. సూపర్ హీరో కాన్సెప్ట్‌తో.. సినిమాచేశాడు ప్రశాంత్ వర్మ. సంక్రాంతి కానుకగా.. జనవరి 12న రిలీజ్ అయిన ఈ సినిమా.. పాన్ ఇండియా రేంజ్లో సెన్సేషనల్ హిట్టైంది. వరల్డ్ వైడ్ 300కోట్ల మార్క్ వైపు పరుగెడుతోంది. ఇక ఈ క్రమంలోనే టాలీవుడ్ నుంచి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటికి వచ్చింది. అదేంటంటే.
హనుమాన్ మూవీ సక్సెస్ అవ్వడం.. ఒకరకంగా బ్లాక్ స్టర్ హిట్ అవ్వడంతో.. ప్రశాంత్ వర్మ.. ఆ సంతోషంలో తన కోరికను తీర్చుకున్నారట. 6 కోట్ల విలువైన బ్రాండ్ న్యూ రేంజ్ రోవర్ కారును బుక్ చేశారట. ఆ కార్ కోసం చాలా కాలంగా చూస్తున్నాడట ప్రశాంత్ వర్మ. ఇక కార్ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదరుచూస్తున్నాడట ప్రశాంత్ వర్మ. ప్రస్తుతం ఈన్యూస్ వైరల్ అవుతోంది.