Asianet News TeluguAsianet News Telugu

#Hanuman హనుమాన్..నార్త్ లో... ఆ రెండు సినిమాలను దాటేసి పెద్ద జంప్

ఇప్ప‌టివ‌ర‌కు హనుమాన్ మూవీ రూ.40 కోట్ల పైనే వ‌సూళ్లు రాబట్టిందని సమాచారం. అయితే ఈ లెక్కలపై  మేకర్స్ మాత్రం ఎలాంటి అధికారిక ప్ర‌క‌టన ఇవ్వలేదు.

HanuMan first opening weekend total is higher than #KGF and #Kantara jsp
Author
First Published Jan 16, 2024, 8:48 AM IST


ఈ సంక్రాంతికి విన్నర్ గా ఇనానమస్ గా హనుమాన్ ఎంపికైంది. ఈ సినిమా కేవలం మన తెలుగులో కాకుండా ప్యాన్ ఇండియా మార్కెట్ లో దుమ్ము రేపుతోంది. నార్త్ లో హనుమాన్(HanuMan) సినిమా దెబ్బకు అక్కడ  పాత రికార్డ్స్  బ్రద్దలు అవుతున్నాయి.  కొత్త రికార్డ్స్ క్రియేట్ అవుతున్నాయి.   ఈ సూపర్ హీరో మూవీకి ఉత్తరాది ప్రేక్షకులు బ్రహ్మరధం పడుతున్నారు. కేవలం మౌత్ టాక్ తోనే సినిమా హౌస్ ఫుల్స్ అవుతున్నాయి.   కార్తికేయ-2, కాంతార లాంటి సినిమాలు నార్త్ ఇండియాను ఊపేయటం అందరికీ గుర్తు వస్తోంది. ఇప్పుడు మరోసారి అలాంటి మ్యాజిక్కే జరుగుతోందని అర్దమవుతోంది.   

ఇక ఈ విషయాన్ని అఫీషియల్ గా ప్ర‌ముఖ బాలీవుడ్ సినీ క్రిటిక్ త‌ర‌ణ్ ఆద‌ర్శ్ ఇదే విషయాన్ని తన సోష‌ల్ మీడియా వేదిక‌గా తెలిపారు. 2024లో తొలి బ్లాక్ బస్టర్ మూవీ హ‌నుమాన్‌. మొద‌టి మూడు రోజుల్లో భారీ వసూళ్లు సాధించింది ఈ మూవీ. కేజీఎఫ్ 1, కాంతార హిందీ వ‌ర్ష‌న్స్‌ కంటే ఎక్కువ‌ వసూళ్లు రాబట్టింది ఈ మూవీ. రాను రాను ఈ కలెక్షన్స్ పెరుగుతూ వస్తున్నాయి. హిందీలో డే 1 రూ.2.15 కోట్లు, రెండో రోజు రూ.4.05 కోట్లు, మూడో రోజు రూ.6.06 కోట్ల వసూళ్లు రాబట్టింది ఈ మూవీ. ఇక హిందీలో జ‌న‌వ‌రి 25వ‌ర‌కు పెద్ద సినిమా రిలీజ్ లేదు కాబట్టి హ‌నుమాన్ క‌లెక్ష‌న్స్ మ‌రింత పెరిగే అవకాశం ఉంది.. అంటూ రాసుకొచ్చాడు తరణ్. ఇక ఓవరాల్ గా చూసుకుంటే.. ఇప్ప‌టివ‌ర‌కు హనుమాన్ మూవీ రూ.40 కోట్ల పైనే వ‌సూళ్లు రాబట్టిందని సమాచారం. అయితే ఈ లెక్కలపై  మేకర్స్ మాత్రం ఎలాంటి అధికారిక ప్ర‌క‌టన ఇవ్వలేదు.

ఇక నార్త్ లో  రోజు రెండు కోట్లు రాబట్టిన హనుమాన్ హిందీ వర్షన్.. రెండో రోజు నాలుగు కోట్లకు పైగా కలెక్షన్ తెచ్చుకుని షాక్ ఇచ్చింది. అదే స్పీడులో  మూడో రోజుకు వసూళ్లు ఇంకా పెరిగి ఆరు కోట్లు దాటేయడం విశేషం. మొత్తంగా వసూళ్లు 12 కోట్ల మార్కును అందుకున్నాయి.   తెలుగు రాష్ట్రాల్లోనూ  హనుమాన్ సినిమా వసూళ్లు రెండో రోజు అంటే శనివారం 55 శాతానికి పైగా పెరిగి అందరికీ షాక్ ఇచ్చాయి. మూడో రోజు భీబత్సమే అయ్యింది. చాలా చోట్ల గుంటూరు కారం చాలా స్క్రీన్స్ కూడా.. హనుమాన్‌కి షిప్ట్ కావడం విశేషం. ఈ చిత్రానికి టిక్కెట్ల డిమాండ్ భారీగా ఉంది . దీని కారణంగా అదనపు షోలు, థియేటర్లు నిరంతరం పెరగడం విశేషం. ప్రతి రోజు గడిచేకొద్దీ పెద్ద సంఖ్యలో హనుమాన్ చూడాలని అనుకునేవారి సంఖ్య పెరగుతున్నారు. పండగ రోజుల్లో ఈ సినిమా అన్ని ఏరియాల్లో సంచలనం సృష్టిస్తోంది. హనుమాన్ కోసం అడ్వాన్స్ బుకింగ్‌లు రాబోయే రోజుల్లో బలంగా ఉన్నాయి. 

   తేజ సజ్జా హీరోగా నటించిన ‘హనుమాన్’ మూవీ ఒక సూపర్ హీరో చిత్రంగా తెరకెక్కింది. ఈ మూవీలో హీరోయిన్‌గా అమృతా అయ్యర్ నటించింది. వరలక్ష్మి శరత్‌కుమార్ మరో కీలక పాత్ర పోషించింది. ఇప్పటికే ఈ మూవీ విడుదలయ్యిన మంచి టాక్ తెచ్చుకుని,  పిల్లలను ,  విపరీతంగా ఆకట్టుకుంటోంది.  పైగా తెలుగులో మాత్రమే కాదు.. ‘హనుమాన్’ను పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల చేసాన్నారు కాబట్టి ఇతర భాషల్లో కూడా ప్రమోషన్స్ భారీగానే జరిగింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios