యంగ్ హీరో సుహాస్ నెమ్మదిగా సినిమాలు చేస్తూ హీరోగా ఎదుగుతున్నాడు. ఇప్పుడు `అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్` చిత్రంలో నటించాడు. ఈ మూవీ నుంచి రెండో పాట విడుదలైంది.
యంగ్ హీరో తేజా సజ్జ ప్రస్తుతం `హనుమాన్` చిత్రంలో నటించాడు. ఇది సంక్రాంతికి రానుంది. ఈనేపథ్యంలో ఆయన ఇప్పుడు సుహాస్ సినిమాకి సపోర్ట్ గా నిలిచాడు. సుహాస్ హీరోగా రూపొందుతున్న చిత్రం `అంబాజీపేట మ్యారేజి బ్యాండ్`. ఈ మూవీకి సంబంధించిన రెండో పాటని తాజాగా విడుదల చేశారు. దీన్ని తేజ సజ్జా విడుదల చేయడం విశేషం. తన సినిమా రిలీజ్ విషయంలో ఇతర హీరోల సహాయం తీసుకుంటున్న తేజ.. మరో చిన్న సినిమాకి తనవంతు సపోర్ట్ ఇవ్వడం విశేషం.
సుహాస్ హీరోగా రూపొందుతున్న `అంబాజీపట మ్యారేజి బ్యాండ్` చిత్రంలోని పాటని తేజ విడుదల చేశాడు. `మా ఊరు` అంటూ సాగే పాటని మంగళవారం ఉదయం తేజ రిలీజ్ చేశాడు, చిత్ర బృందానికి అభినందనలు తెలియజేశాడు. `మా ఊరు `అంటూ సాగే ఈ పాటని కాళ భైరవ ఆలపించారు. శేఖర్ చంద్ర మ్యూజిక్ ఇచ్చాడు. రెహ్మాన్ లిరిక్స్ అందించారు. 'రారో మా ఊరు సిత్రాన్ని సూద్దాం...ఇటు రారో ఈ బతుకు పాటను ఇందాం. ఈ సన్నాయి నొక్కుల్లోనా ఊరించే సంగతులెన్నో ఉన్నాయ్..'అంటూ సాగే ఈ పాట పల్లేటూరి యాసలో సాగుతూ ఆద్యంతం ఆకట్టుకుంటుంది.
ఇక సుహాస్, శివానీ నాగరం జంటగా నటించిన ఈ చిత్రంలో శరణ్య ప్రదీప్, జబర్దస్త్ ప్రతాప్ భండారి, గోపరాజు రమణ కీలక పాత్రలు పోషించారు. దుశ్వంత్ కటికినేని దర్శకత్వం వహించారు. వెంకటేష్ మహా బ్యానర్ మహాయన మోహన్ పిక్చర్స్, జీఏ 2 పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్‌మెంట్స్ పతాకాలపై ఈ చిత్రం రూపొందుతుంది. ఫిబ్రవరి 2న ఈ చిత్రం విడుదల కాబోతుంది.
