‘హను-మాన్’ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ Prashanth Varma గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలో సూపర్ విమెన్ సినిమాతో అలరించబోతున్నారని చెప్పారు. అందులో హీరోయిన్ గా నటించే ముద్దుగుమ్మ ఎవరనేది తాజాగా వెల్లడైంది. 

టాలీవుడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో సెన్సేషన్ గా మారారు. యంగ్ హీరో తేజా సజ్జ Teja Sajja తో ‘హనుమాన్’ HanuManను తెరకెక్కించి సంచలనం సృష్టించారు. జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సూపర్ హీరో ఫిల్మ్ సెన్సేషన్ టాక్ ను సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద కూడా కాసుల వర్షం కురిపించింది. ఓవర్సీస్ లోనూ ప్రేక్షకులు హిట్ చేశారు. ఇప్పటి వరకు రూ.200 కోట్లకు పైగా గ్రాస్ ను ప్రపంచ వ్యాప్తంగా సాధించింది. ఇంకా వసూళ్లు రాబడుతోంది. రూ.300 కోట్ల క్లబ్ లో చేరేందుకు సిద్దమవుతోంది. 

ఇలా ‘హనుమాన్’తో ప్రస్తుతం టాలీవుడ్ లో సెన్సేషన్ గా మారిన ప్రశాంత్ వర్మ నెక్ట్స్ మూవీ ఏంటనేది ఆసక్తికరంగా మారింది. ఇందుకు ఇప్పటికే ఆయన ‘హనుమాన్’ సీక్వెల్ ను ప్రకటించారు. ‘జై హనుమాన్’ Jai HanuMan అనే టైటిల్ తో ఆ సినిమా రానుంది. ఇందులో తేజా సజ్జానే కాకుండా ఓ స్టార్ హీరో ప్రధాన పాత్ర పోషించనున్నారు. ఇక ప్రశాంత్ వర్మ మరో రెండు సినిమాలను కూడా డైరెక్ట్ చేస్తున్నారు. ఇందులో ఒకటి సూపర్ విమెన్ Super Women మూవీ ని కూడా డైరెక్ట్ చేస్తుండటం విశేషం. 

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలోని ఒక చిత్రం ‘అధీర’ కాగా.. మరొక చిత్రం ‘మహాకాళి’ అని చెప్పారు. బహుశా ఇదే సూపర్ విమెన్ ఫిల్మ్ అని తెలుస్తోంది. అయితే ఇందులో యంగ్ హీరోయిన్ జ్ఞానేశ్వరి కాండ్రేగుల (Gnaneshwari Kandregula) నటిస్తున్నట్టు స్వయంగా ఆమెనే వెల్లడించింది. రీసెంట్ ఇంటర్వ్యూలో రివీల్ చేసింది. ఈ ముద్దుగుమ్మ గతంలో మంత్ ఆఫ్ మధు’, ‘నీ జతగా’, ‘మాయలో’, ‘మిస్టర్ అండ్ మిస్’ చిత్రాల్లో హీరోయిన్ నటించింది. ‘పెళ్లిచూపులు’ సినిమాలో నటిగా మంచి గుర్తింపు దక్కించుకుంది.