రాజమౌళిపై కోపం వచ్చింది, స్టార్స్ తో అందుకే సినిమాలు చేయను... ప్రశాంత్ వర్మ ఇలా అనేశాడు ఏంటీ?

హనుమాన్ మూవీతో డబుల్ బ్లాక్ బాస్టర్ కొట్టాడు ప్రశాంత్ వర్మ. ఆయన టాక్ ఆఫ్ ది నేషన్ అయ్యాడు. వరుస ఇంటర్వ్యూలతో బిజీగా ఉంటున్న ప్రశాంత్ వర్మ లేటెస్ట్ కామెంట్స్ సంచలనంగా మారాయి. 
 

hanuman director prashanth varma interesting comments on director rajamouli ksr


నూటికో కోటికో హనుమాన్ వంటి చిత్రాలు వస్తాయి. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సోషియో ఫాంటసీ మూవీ ప్రేక్షకులను మంత్ర ముగ్దుల్ని చేసింది. మహేష్ బాబు, నాగార్జున, వెంకటేష్ లతో సంక్రాంతి బరిలో పోటీ పడ్డ తేజ సజ్జా విన్నర్ అయ్యాడు. హనుమాన్ మూవీ సక్సెస్ క్రెడిట్ లో అధిక భాగం దర్శకుడు ప్రశాంత్ వర్మకే దక్కుతుంది. రూ. 50 కోట్ల బడ్జెట్ లో రూ. 500 కోట్లకు మించిన విజువల్స్ ఇచ్చాడు. 

హనుమాన్ మూవీ బడా చిత్రాల దర్శకులకు ఒక రిఫరెన్స్ అని బాలీవుడ్ ప్రముఖులు సైతం కొనియాడారు. హనుమాన్ వరల్డ్ వైడ్ రూ. 250 కోట్ల మార్క్ దాటేసింది. కేవలం రూ. 22 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన హనుమాన్ ఏ స్థాయిలో లాభాలు పంచిందో అంచనా వేయవచ్చు. యూఎస్ లో హనుమాన్ $ 5 మిలియన్ వసూళ్లు దాటేసింది. టాప్ స్టార్స్ కూడా అందుకోలేని ఫీట్ ఇది. 

కాగా ప్రశాంత్ వర్మ టాలెంట్ ని పరిశ్రమ ఇప్పుడు గుర్తిస్తుంది. గతంలో రాజమౌళి అసిస్టెంట్ గా ప్రశాంత్ వర్మను రిజెక్ట్ చేశాడట. ఆ విషయంలో కోపం వచ్చిందంటూ ప్రశాంత్ వర్మ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ''రాజమౌళి మేకింగ్ స్టైల్ అంటే నాకు చాలా ఇష్టం. ఇంజనీరింగ్ చదివే రోజుల్లోనే ఆయనకు అసిస్టెంట్ గా అవకాశం ఇవ్వమని మెయిల్స్ పెట్టేవాడిని. తన టీమ్ లో ఖాళీ లేదని రాజమౌళి సున్నితంగా తిరస్కరించేవారు. 

నేను ఇంత హార్డ్ వర్క్ చేస్తాను అయినా రాజమౌళి అవకాశం ఇవ్వడం లేదని ఆయన మీద కోపం వచ్చింది. నేను పెద్ద హీరోలతో సినిమాలు చేసేందుకు వ్యతిరేకం కాదు. స్టార్ తో మూవీ అంటే సమయం వృధా అవుతుంది. అలా ఎదురుచూసి టైం వేస్ట్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకే నా దగ్గర ఉన్న వారితో సినిమాలు చేస్తాను. డెడ్ లైన్ పెట్టుకుని సినిమాలు చేస్తున్నాను. టామ్ క్రూజ్ వచ్చినా నాకు అందుబాటులో ఉన్న హీరోతోనే మూవీ చేస్తాను... అని చెప్పుకొచ్చాడు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios