సినిమాలు ఫెయిలయ్యి ఉండవచ్చు కానీ దర్శకుడుగా హను రాఘవపూడి మాత్రం ఎప్పుడూ కాలేదని ఆయన సినిమాలు చూసిన వారు చెప్తారు. ఆయన సినిమాల పట్ల చూపే డెడికేషన్ ఆయన తీసే సినిమాల ప్రతీ ఫ్రేమ్ లోనూ కనిపిస్తుంది. తొలి చిత్రం అందాల రాక్షసి నుంచీ ఆయన మేకింగ్ స్టైల్ డిఫరెంట్ గా ఉంటుంది. మణిరత్నం సినిమాలను అనుసరిస్తూ తనకంటూ ఓ మార్క్ వేసుకున్న హను ..ఈ మధ్యన నితిన్ తో చేసిన  'లై' .. శర్వానంద్ తో చేసిన 'పడి పడి లేచే మనసు' డిజాస్టర్ అవటంతో బాగా వెనక పడ్డారు. ఈ నేపధ్యంలో ఏ హీరోతో సినిమా చేయాలనేది ఆయనకు డైలమోగా మారింది.

అందుతున్న సమాచారం మేరకు...హను రీసెంట్ గా నాని ని కలిసి ఓ స్టోరీ లైన్ వినిపించినట్లు తెలుస్తోంది. గతంలో నాని హీరోగా ఆయన తెరకెక్కించిన 'కృష్ణగాడి వీర ప్రేమగాథ' మంచి విజయం సాధించటం జరిగింది. దాంతో హను రాఘవపూడి దర్శకత్వంలో సినిమా చేయటానికి నాని ఉత్సాహం చూపిస్తున్నట్లు సమాచారం. అయితే పూర్తి సీరియస్ సబ్జెక్టు వద్దని ఫన్ మిక్స్ చేసి తీసుకురమ్మని చెప్పాడట. 

దాంతో ఈ సారి తప్పకుండా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఆయన ఒక కథను సిద్ధం చేసుకున్నాడని చెప్తున్నారు. ప్రస్తుతం రెడీ చేస్తున్న స్క్రిప్టును నానీకి కి వినిపించే దిశగా ఆయన ప్రయత్నాలు చేస్తున్నట్టుగా ఫిల్మ్ నగర్లో చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం నాని 'గ్యాంగ్ లీడర్' సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే పనిలో వున్నాడు. ఇక ఇంద్రగంటి దర్శకత్వంలో ఆయన 'వి' సినిమాను పూర్తి చేయవలసి వుంది. ఈ సినిమాల తరువాత ఆయన హను రాఘవపూడితో కలిసి ముందుకు వెళతాడా? లేదా? అనేది తెలుస్తుంది.