Asianet News TeluguAsianet News Telugu

హై జోష్ లో 'హను-మాన్' టీమ్.. అయోధ్యలో తేజ సజ్జా, ప్రశాంత్ వర్మ ప్రత్యేక పూజలు

చైల్డ్ ఆర్టిస్ట్ గా తెలుగులో గుర్తింపు సొంతం చేసుకున్న యువ నటుడు తేజ సజ్జా ప్రస్తుతం హీరోగా ఒక్కో మెట్టు ఎదుగుతున్నాడు. వైవిధ్యమైన చిత్రాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నాడు.

Hanu Man hero Teja Sajja and prashanth varma visits Ayodhya
Author
First Published Nov 30, 2022, 7:52 PM IST

చైల్డ్ ఆర్టిస్ట్ గా తెలుగులో గుర్తింపు సొంతం చేసుకున్న యువ నటుడు తేజ సజ్జా ప్రస్తుతం హీరోగా ఒక్కో మెట్టు ఎదుగుతున్నాడు. వైవిధ్యమైన చిత్రాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నాడు. ప్రయోగాల బాట పడుతూ పెద్ద సాహసాలే చేస్తున్నాడు ఈ యంగ్ హీరో. 

తేజ సజ్జా చివరగా నటించిన 'అద్భుతం' చిత్రం ఓటిటిలో విడుదలై ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. రికార్డు వ్యూస్ సాధించింది. ప్రస్తుతం తేజ సజ్జా.. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో హను మాన్ అనే పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్నాడు. హను మాన్ చిత్రం ఆంజనేయ స్వామి నేపథ్యంలో విజువల్ వండర్ గా తెరకెక్కుతోంది. 

తేజ సజ్జా, ప్రశాంత్ వర్మ హను మాన్ తో పెద్ద అద్భుతమే సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ చిత్రంలో తేజ సజ్జా సూపర్ హీరోగా నటిస్తున్నాడు.  అమృత అయ్యర్ కథానాయికగా నటిస్తోంది. 

ఇటీవల ఈ చిత్ర టీజర్ విడుదలై ప్రతి ఒక్కరిని ఆశ్చర్యంలో ముంచెత్తేసింది. వందల కోట్ల బడ్జెట్ లో తెరకెక్కించిన చిత్రాల్లో కూడా కనిపించిన అద్భుతమైన విజువల్స్ హను మాన్ టీజర్ లో అబ్బురపరిచాయి. దీనితో ఒక్కసారిగా సినిమా అంచనాలు ఆకాశాన్ని తాకాయి. టీజర్ కి వచ్చిన రెస్పాన్స్ తో హను మాన్ టీమ్ హై జోష్ లో ఉంది. 

ఈ చిత్రానికి పాన్ ఇండియా స్థాయిలో ప్రచారం కల్పించేందుకు చిత్ర యూనిట్ రెడీ అయింది. తాజగా తేజ సజ్జా, ప్రశాంత్ వర్మ అయోధ్యలో పర్యటించారు. టీజర్ కి అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో వీరిద్దరూ అయోధ్య ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ దృశ్యాలని సోషల్ మీడియాలో పంచుకున్నారు. 

ఆ శ్రీరాముడి జన్మభూమిలో భగవంతుడి ఆశీస్సులు పొందాం. టీజర్ కి మీరు అందిస్తున్న స్పందన చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది అని తేజ సజ్జా ఇంస్టాగ్రామ్ లో పేర్కొన్నాడు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios