చిరంజీవి మాటలకు ఎమోషనల్ అయిన ప్రశాంత్ వర్మ.. కన్నీళ్లు ఆగడం లేదు అంటూ
ప్రశాంత్ వర్మ, తేజ సజ్జా కలసి సృష్టించిన అద్భుతం హను మాన్ చిత్రం. ఆంజనేయ స్వామి బ్యాక్ డ్రాప్ లో సూపర్ హీరో చిత్రంగా తెరకెక్కిన హనుమాన్ పాన్ ఇండియా వైడ్ సంచలనాలు సృష్టించింది. ఇండియా మొత్తం ఈ చిత్రం 300 కోట్లకి పైగా వసూళ్లు సాధించి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది.
ప్రశాంత్ వర్మ, తేజ సజ్జా కలసి సృష్టించిన అద్భుతం హను మాన్ చిత్రం. ఆంజనేయ స్వామి బ్యాక్ డ్రాప్ లో సూపర్ హీరో చిత్రంగా తెరకెక్కిన హనుమాన్ పాన్ ఇండియా వైడ్ సంచలనాలు సృష్టించింది. ఇండియా మొత్తం ఈ చిత్రం 300 కోట్లకి పైగా వసూళ్లు సాధించి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
తేజ సజ్జాకి చిరంజీవితో అనుబంధం ఉన్న సంగతి తెలిసిందే. ఇంద్ర చిత్రంలో తేజ సజ్జా చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు. ఇక చిరంజీవి ఆంజనేయ స్వామి అంటే భక్తి శ్రద్ధలు ప్రదర్శిస్తారు. చిరంజీవి కుటుంబ కులదైవం అంజనేయస్వామి. ఇటీవల చిరంజీవి జాతీయ మీడియా నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి తేజ సజ్జా కూడా హాజరయ్యాడు.
మీరు చేయాలనుకుని చేయలేకపోయిన చిత్రం ఏంటని యాంకర్ చిరంజీవిని ప్రశ్నించగా.. మెగాస్టార్ ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. తేజ సజ్జని చిరు చూపిస్తూ.. అంజనేయ స్వామి నేపథ్యంలో నేను సినిమా చేయాలనుకున్నా. కానీ తేజ సజ్జా హనుమాన్ చిత్రంలో నటించి అద్భుత విజయం అందుకున్నాడు. నా కోరిక తేజ సజ్జా రూపంలో తీరినందుకు చాలా సంతోషంగా ఉంది అని చిరంజీవి అన్నారు.
చిరు అంత మాట అనగానే తేజ సజ్జా చేతులు జోడించి నమస్కరించాడు. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేశారు. చిరంజీవి అంతటి వారు హనుమాన్ చిత్రం గురించి చెప్పిన మాటలు నా భుజాలపై మరింత బాధ్యత పెంచేవి. ఈ వీడియో చూస్తుంటే సంతోషంలో నాకు కన్నీళ్లు ఆగడం లేదు.. ఇక అక్కడున్న తేజ సజ్జా పరిస్థితి, అతడి సంతోషం అర్థం చేసుకోగలను అని ప్రశాంత్ వర్మ ట్వీట్ చేశారు.