అందాలు పెరిగేందుకు హన్సిక ఇంజక్షన్స్ తీసుకుందా.. యాపిల్ బ్యూటీ తల్లి షాకింగ్ కామెంట్స్
అల్లు అర్జున్ సరసన దేశముదురు చిత్రంలో గ్లామర్ మోత మోగించింది హన్సిక. టీనేజ్ వయసులోనే గ్లామర్ రచ్చ షురూ చేసిన ఈ యాపిల్ పిల్ల యువత హృదయాల్లో కొలువైంది.
అల్లు అర్జున్ సరసన దేశముదురు చిత్రంలో గ్లామర్ మోత మోగించింది హన్సిక. టీనేజ్ వయసులోనే గ్లామర్ రచ్చ షురూ చేసిన ఈ యాపిల్ పిల్ల యువత హృదయాల్లో కొలువైంది. ఇప్పటికే హన్సిక గ్లామర్ చూస్తే కుర్రాళ్లకు తెలియని అలజడి మొదలవుతుంది.
అంతలా తన గ్లామర్ తో మెస్మరైజ్ చేసిన హన్సిక వివాహ జీవితంలోకి అడుగుపెట్టింది. గత ఏడాది డిసెంబర్ 4న జైపూర్ లో హన్సిక, సోహైల్ వివాహబంధంతో ఒక్కటయ్యారు. టీనేజ్ నుంచి హీరోయిన్ గా అలరిస్తున్న ఈ యాపిల్ బ్యూటీ ఎట్టకేలకు పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం మ్యారేజ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్న హన్సిక తాజాగా ఓ టాక్ షో లో పాల్గొంది. ఈ టాక్ షోలో హన్సిక తనపై జరుగుతున్న సంచలన రూమర్ గురించి నోరు విప్పింది. ఈ షోలో హన్సిక తల్లి మోనా కూడా పాల్గొన్నారు.
సెలెబ్రిటీల శరీరంలో చిన్న మార్పు కనిపించినా సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతుంది. వాళ్లేందుకు అలా అయ్యారు, సర్జరీ చేయించుకున్నారా అంటూ అనుమానాలు మొదలవుతాయి. హన్సిక విషయంలో కూడా అదే జరిగింది. హన్సిక అందాలు పెంచుకునేందుకు హార్మోనల్ ఇంజక్షన్ తీసుకుందని గతంలో పుకార్లు వినిపించాయి.
నాకు 21 ఏళ్ల వయసున్నప్పుడు చాలా మంది చెత్త వాగుడు వాగారు. నానా గురించి అసభ్యంగా రాశారు. నేను 8 ఏళ్లకే నటిని అయ్యాను. త్వరగా ఎదిగేందుకు మా అమ్మ నాకు ఇంజక్షన్ ఇచ్చినట్లు చాలా అసభ్యంగా ప్రచారం చేశారు. అసలు ఇలాంటివి నిజం అని ఎలా నమ్ముతారు అంటూ హన్సిక అసహనం వ్యక్తం చేసింది.
హన్సిక తల్లి మోనా మాట్లాడుతూ.. నేను నిజంగా హన్సికకి ఇంజక్షన్స్ ఇచ్చి పెంచి ఉంటే టాటా బిర్లా కంటే ధనవంతురాలిని అయ్యే దానిని. ప్రతి ఒక్కరు త్వరగా పెరిగేందుకు నా దగ్గరికే వచ్చేవారు కదా.. ఇలా అసత్యమైన ప్రచారాలు చేసేందుకు కనీసం కామన్ సెన్స్ ఉండాలి అంటూ హన్సిక తల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు.