శింబుతో లవ్, బ్రేకప్ గురించి హన్సిక హాట్ కామెంట్స్.. 8 ఏళ్ల టైం పట్టింది, అది ముగిసిన కథ..
అల్లు అర్జున్ సరసన దేశముదురు చిత్రంలో గ్లామర్ మోత మోగించింది హన్సిక. టీనేజ్ వయసులోనే గ్లామర్ రచ్చ షురూ చేసిన ఈ యాపిల్ పిల్ల యువత హృదయాల్లో కొలువైంది.
అల్లు అర్జున్ సరసన దేశముదురు చిత్రంలో గ్లామర్ మోత మోగించింది హన్సిక. టీనేజ్ వయసులోనే గ్లామర్ రచ్చ షురూ చేసిన ఈ యాపిల్ పిల్ల యువత హృదయాల్లో కొలువైంది. ఇప్పటికే హన్సిక గ్లామర్ చూస్తే కుర్రాళ్లకు తెలియని అలజడి మొదలవుతుంది.
అంతలా తన గ్లామర్ తో మెస్మరైజ్ చేసిన హన్సిక వివాహ జీవితంలోకి అడుగుపెట్టింది. గత ఏడాది డిసెంబర్ 4న జైపూర్ లో హన్సిక, సోహైల్ వివాహబంధంతో ఒక్కటయ్యారు. టీనేజ్ నుంచి హీరోయిన్ గా అలరిస్తున్న ఈ యాపిల్ బ్యూటీ ఎట్టకేలకు పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం హన్సిక మ్యారేజ్ సంగతులు డిస్ని ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారం అవుతున్నాయి. ఈ సందర్భంగా హన్సిక అనేక ఆసక్తికర విషయాలని తన లైఫ్ గురించి పంచుకుంది. తాను త్వరగా ఎదిగేందుకు హార్మోనల్ ఇంజక్షన్స్ తీసుకున్నట్లు జరిగిన ప్రచారాన్ని హన్సిక ఖండించింది.
తాజాగా తన పర్సనల్ లైఫ్ లో జరిగిన ప్రేమ సంగతులు వివరించింది. హన్సిక, స్టార్ హీరో శింబుతో చాలా కాలం పాటు ఘాడమైన ప్రేమలో మునిగితేలింది. ఈ జంట పెళ్లి పీటల వరకు కూడా వెళ్లారు. కానీ చివరి దశలో బ్రేకప్ జరిగింది. దాని గురించి హన్సిక మాట్లాడుతూ.. నా గత రిలేషన్ షిప్ విచిత్రంగా సాగింది. కానీ అది ఇప్పుడు ముగిసిన కథ. ఒకసారి బ్రేకప్ అయిన తర్వాత మరొకరికి యస్ చెప్పడానికి 8 ఏళ్ల సమయం పట్టింది.
నేను ప్రేమని నమ్ముతాను,స్పందిస్తాను. కానీ రొమాంటిక్ పర్సన్ ని కాదు. అందుకే నాతో లైఫ్ లాంగ్ ఉండే వ్యక్తిని ఎంపిక చేసుకోవడానికి ఇంత సమయం పట్టింది అని హన్సిక చెప్పుకొచ్చింది. హన్సిక సోహైల్ ఆమెకి స్నేహితుడు. చిన్నతనంలోనే వీరిద్దరూ ఫ్రెండ్స్. ఆ తర్వాత బిజినెస్ పార్ట్నర్స్ గా మారారు. అలా వీరి మధ్య ప్రేమ చిగురించి పెళ్లి చేసుకున్నారు.