హీరోయిన్ హన్సిక కి షూటింగ్ లో గాయాలు అయినట్లు సమాచారం. రక్తం కూడా చాలా పోయిందట. అయినప్పటికీ ఆమె షూటింగ్ మాత్రం ఆపలేదని తెలుస్తోంది. అసలు విషయంలోకి వస్తే.. కోలివుడ్ స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతోన్న నటి హన్సిక ప్రస్తుతం తన 50వ సినిమా 'మహా'లో నటిస్తోంది.

గతంలో ఈ సినిమా పోస్టర్లు అభ్యంతరకరంగా ఉన్నాయని హన్సిక పై అలానే చిత్ర దర్శకనిర్మాతలపై కేసులు పెట్టారు. ఈ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇది ఇలా ఉండగా రీసెంట్ గా సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్న సమయంలో అనుకోకుండా హన్సిక జారి కింద పడిపోయిందట.

చేతికి గాయాలు అవ్వడంతో పాటు చాలా రక్తం పోయింది. దీంతో షూటింగ్ ఆపేద్దామని, హాస్పిటల్ కి వెళ్దామని చిత్రబృందం ఎంతగా బతిమిలాడినా.. హన్సిక మాత్రం అంగీకరించలేదట. చేతికి బ్యాండేజ్ వేసుకొని నటించి, ఆమె పోర్షన్ పూర్తయిన తరువాతే ఇంటికి వెళ్లిందట.

వర్క్ విషయంలో ఆమె చూపించిన డెడికేషన్ పట్ల దర్శకనిర్మాతలు ఆమెను మెచ్చుకున్నట్లు తెలుస్తోంది. యుఆర్ జమీల్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.