రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు విజయ నిర్మల క్లూటుంబాన్నీ పరామర్శిస్తున్నారు. తెలుగు దేశం పార్టీ అధినేత కూడా కుటుంబ సభ్యులతో విజయ నివాసానికి వచ్చి కృష్ణ, మహేష్ బాబులను కలిశారు. ఆయనతో పాటు బాలకృష్ణ నారా లోకేష్ కూడా ఉన్నారు. 

విజయ నిర్మల ఫోటోకి పూలతో నివాళుర్పించి ఇంట్లో ఉన్న అలనాటి చిత్రాలను వీక్షించారు. కృష్ణను ఓదార్చి దైర్యంగా ఉండాలని పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన  చంద్రబాబు.. కృష్ణ దంపతులది విలువలతో కూడిన జీవిత ప్రయాణం. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాడ సానుభూతి తెలియజేస్తున్నాను అంటూ చంద్రబాబు వివరణ ఇచ్చారు. బాలకృష్ణ కూడా నరేష్, కృష్ణను ప్రత్యేకంగా కలుసుకొని పరామర్శించారు. 

సినీ నటిగా తెలుగు ఇండస్ట్రీలో చెరగని ముద్ర వేసిన విజయనిర్మల గుండెపోటుతో మృతి చెందిన సంగతి తెలిసిందే. దర్శకురాలిగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న ఆమె మరణాన్ని కుటుంబ సభ్యులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు.