జూబ్లీ హిల్స్ లో కియా సోనెట్ కారుని ఆయన బహుమతిగా ఇచ్చారు. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ఈ గిఫ్ట్ ని జిమ్నాస్టిక్స్ బుద్దా అరుణారెడ్డికి అందజేయడం విశేషం.
ఇంటర్నేషనల్ జిమ్నాస్టిక్స్ వేదికపై సత్తా చాటిన తెలంగాణ క్రీడాకారిణి బుద్దా అరుణారెడ్డికి(Buddha Aruna Reddy) ఓ సర్‌ప్రైజ్ గిఫ్ట్ దక్కింది. ఆమెకి మాజీ బీసీసీఐ జూనియర్ సెలక్షన్ కమిటీ చైర్మెన్ ఛాముండేశ్వరనాథ్ కియాకారుని గిఫ్ట్ ని అందించారు. జూబ్లీ హిల్స్ లో కియా సోనెట్ కారుని ఆయన బహుమతిగా ఇచ్చారు. అయితే మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) చేతుల మీదుగా ఈ గిఫ్ట్ ని జిమ్నాస్టిక్స్ బుద్దా అరుణారెడ్డికి అందజేయడం విశేషం. చిరంజీవి, కాకినాడ పోర్ట్ చైర్మెన్ కేవీ రావులు కలిసి సంయుక్తంగా కారు కీని అరుణారెడ్డికి అందజేశారు.
ఇదిలా ఉంటే ఇటీవల మోకాలి సర్జరీ నుంచి కోలుకున్న అరుణా ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ లో స్వర్ణ పతకాలు సాధించారు. అంతకు ముందు ఆమె 2018లో ప్రపంచ జిమ్నాస్టిక్ ఛాంపియన్ షిప్‌లో కాంస్య పతకాన్ని సాధించారు. మోకాలి సర్జరీ జరిగిన తర్వాత ఇటీవలే ఆమె మళ్లీ క్రీడల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. 25ఏళ్లలోనే అరుణ పలు అరుదైన రికార్డులు నెలకొల్పడం విశేషం. ఈజిప్ట్ కైరోలో మంగళ మంగళవారం ముగిసిన ఫారోస్ కప్ ఇంటర్నేషనల్ ఆర్టిస్టిక్స్ టోర్నీలో రెండు గోల్డ్ మెడల్స్ సాధించింది. హోరాహోరిగా సాగిన వాల్ట్ ఫైనల్లో అరుణ 13.487 స్కోర్‌తో టాప్ ప్లేస్ సాధించింది. 0.04 తేడాతో గోల్డ్ కైవలం చేసుకోవడం విశేషం.
ఫ్లోర్ ఈవెంట్ ఫైనల్లో అరుణ 12.37 స్కోరుతో టాప్ ప్లేస్‌తో ఇంకో గోల్డ్ ఖాతాలో వేసుకుంది. 2018 వరల్డ్‌కప్‌లో బ్రాంజ్ నెగ్గి హిస్టరీ క్రియేట్ చేసిన అరుణ 2019 నవంబర్‌లో మోకాలికి సర్జరీ కావడంతో చాలా రోజులు ఆమె ఆటకు దూరంగా ఉండాల్సి వచ్చింది. చిరంజీవి చేతుల మీదుగా కారుని గిఫ్ట్ గా అందుకోవడం పట్ల అరుణారెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఇది ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతి అని ఆమె తెలిపారు. ఈ సందర్బంగా కారుని గిఫ్ట్ గా ఇచ్చిన ఛాముండేశ్వరనాథ్‌కి ధన్యవాదాలు తెలిపింది బుద్దా అరుణారెడ్డి.
ఇక Chiranjeevi ప్రస్తుంత `ఆచార్య` చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 4న విడుదల కాబోతుంది. దీంతోపాటు `గాడ్‌ఫాదర్`, `భోళాశంకర్`, అలాగే బాబీ దర్శకత్వంలో `మెగాస్టార్154` చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలన్నీ ఇప్పుడు ఈ డిసెంబర్ నెలలో చిత్రీకరణ జరుపుకుంటుండటం విశేషం. ఇలా ఒకే నెలలో నాలుగు సినిమాల్లో నటిస్తున్న స్టార్ హీరోగా చిరంజీవి సంచలనం సృష్టించారని చెప్పొచ్చు.
