Asianet News TeluguAsianet News Telugu

మహేష్ లేకపోయినా మొదలెడదాం.. త్రివిక్రమ్ తాజా నిర్ణయం

యాక్షన్‌, ఫ్యామిలీ సెంటిమెంట్‌ అంశాలతో గుంటూరు కారం చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మహేష్‌బాబు సరికొత్తగా మాస్‌ అవతారంలో కనిపిస్తారని, ...

GunturKaaram starts shooting from Aug 2nd week without Mahesh jsp
Author
First Published Jul 25, 2023, 9:55 AM IST


తెలుగు సినీ  మీడియాలో హాట్ టాపిక్ ఏమిటి అంటే గుంటూరు కారం చిత్రం.దాదాపు ఏడాదిన్నర  క్రితం పూజా కార్యక్రమాలు జరుపుకున్న గుంటూరు కారం ఇప్పటికీ పూర్తికాలేదు. సగంలో సగం షూటింగ్‌ను కూడా పూర్తి చేసుకోలేదనేది నిజం. అదేంటో కానీ ఈ సినిమాకు మొదటి నుంచీ ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. అసలు ఈ సినిమా గురించి వస్తున్న వార్తలే ఆశ్చర్యంగా ఉంటున్నాయి.  రెండు షెడ్యూల్స్ తర్వాత ఏకంగా స్టోరీనే మార్చారంటే అందరూ షాక్ అయ్యారు.ఆ తర్వాత హీరోయిన్  పూజా తప్పుకుందని వార్తలతో మరోసారి గుంటూరు కారం హాట్‌ టాపిక్‌ అయిపోయింది.  తాజాగా ఈ సినిమా నుంచి సినిమాటోగ్రాఫర్‌ పీ.ఎస్‌ వినోద్ తప్పుకున్నట్లు తెలుస్తుంది. ఇప్పుడు ఆ ప్లేస్‌లోకి రవి చంద్రన్‌ వచ్చి చేరాడని ఇన్‌సైడ్‌ టాక్‌. మరో ప్రక్క సినిమాకు బ్రేక్ ఇచ్చి మహేష్ లండన్ వెళ్లారు. త్రివిక్రమ్ ఈ వార్తలకు బ్రేక్ ఇద్దామనుకున్నట్లు సమాచారం.

ఫిల్మ్ నగర్ అంతర్గత వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్రం ఆగస్ట్ రెండవ వారం నుంచి షూటింగ్ మొదలెడుతున్నారు. అయితే ఈ షూట్ లో మహేష్ ఉండరు. మహేష్ కు చెందిన చైల్డ్ హుడ్ సీన్స్ తీయబోతున్నారు.  అలా మహేష్ లేని సీన్స్ పూర్తి చేసి, ఆయన రాగానే వరస పెట్టి ఆయన తో షూట్ చేసి సినిమా ఫినిష్ చేయాలని ప్లాన్ చేసారట. 

అయితే ఇన్ని అవరోధాలు, బ్రేక్ లతో ఇప్పటికే ఈ సినిమా సంక్రాంతికి వస్తుందా లేదా అనే డౌట్‌ అందరిలో వచ్చేసింది. మరో ప్రక్క మ‌హేష్ తీరు విష‌యంలో సినిమా యూనిట్ అసంతృప్తితో ఉన్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఆగ‌స్ట్ ప‌ది త‌ర్వాతే మ‌హేష్‌బాబు ఇండియాకు తిరిగి వ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ట్లు స‌మాచారం. గుంటూరు కారం సినిమాకు త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. అత‌డు, ఖ‌లేజా త‌ర్వాత మ‌హేష్‌బాబు, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న ఈ మూవీ వ‌చ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానుంది. శ్రీలీల, మీనాక్షి చౌద‌రి హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. హారిక హాసిని క్రియేష‌న్స్ ప‌తాకంపై రాధాకృష్ణ ఈ మూవీని నిర్మిస్తున్నాడు.
 

Follow Us:
Download App:
  • android
  • ios