Asianet News TeluguAsianet News Telugu

`గుంటూరు కారం` ట్రైలర్‌ రివ్యూ.. మహేష్‌బాబు మాస్‌ జాతర.. బ్రేకుల్లేని లారీని ఆపేదెవరు?

మహేష్‌బాబు, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వచ్చిన `గుంటూరు కారం` చిత్రం ట్రైలర్‌ విడుదలైంది. మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్ర ట్రైలర్‌ దుమ్మురేపుతుంది. 

guntur kaaram trailer review mahesh babu next level show feast for fans arj
Author
First Published Jan 7, 2024, 9:16 PM IST

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు ప్రస్తుతం `గుంటూరు కారం` చిత్రంతో నటిస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో యంగ్‌ సెన్సేసన్‌ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుంది. మరో క్రేజీ బ్యూటీ మీనాక్షి చౌదరి సెకండ్‌ హీరోయిన్‌గా చేస్తుంది. హారికా అండ్‌ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఈ మూవీ భారీ బడ్జెట్‌తో రూపొందుతుంది. ఈ మూవీ సంక్రాంతికి రాబోతుంది. 

ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్ ఆకట్టుకున్నాయి. ఇందులో మహేష్‌బాబు మాస్‌ లుక్‌కి అంతా ఫిదా అవుతున్నారు. ఇప్పటి వరకు మహేష్‌ ది ఓ లెక్క, ఇకపై మరో లెక్క అనేలా ఈ మూవీలో కనిపించబోతున్నట్టు తెలుస్తుంది. పూర్తిగా ఊరమాస్‌ లుక్‌లో ఆయన కనిపిస్తారని, ఆయన లుక్స్ ని బట్టి తెలుస్తుంది. ఇటీవల వచ్చిన `కుర్చీ మడత పెట్టి` అనే పాట దుమ్మురేపింది. సోషల్‌ మీడియాని ఊపేస్తున్నారు. 

ఇక అంతా ట్రైలర్‌ కోసం వెయిట్‌ చేస్తున్నారు. నిజానికి ఈ ట్రైలర్‌ శనివారమే రావాల్సి ఉంది. హైదరాబాద్‌లో శనివారం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ని ప్లాన్‌ చేశారు. కానీ పోలీసులు పర్మీషన్‌ రద్దు చేయడంతో ట్రైలర్‌ కూడా పోస్ట్ పోన్‌ అయ్యింది. అయితే ఈ రోజు ట్రైలర్‌ రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కానీ అది వాయిదా పడుతూ వచ్చింది. టూ వెయిటింగ్‌ అనంతరం ఎట్టకేలకు ట్రైలర్‌ని విడుదల చేశారు. తాజాగా విడుదలైన `గుంటూరు కారం` ట్రైలర్‌ మాస్‌ జాతరలా సాగింది.  క్లాస్ మాసూ, నాటు, యాక్షన్‌ ఇలా అన్ని అంశాల మేళవింపుతో ట్రైలర్‌ సాగింది. 

ఇక మొదట సెంటిమెంట్‌తో ట్రైలర్‌ని ప్రారంభించారు. పెద్ద కొడుకు(మహేష్)ని చిన్న ప్పుడే అమ్మ వదిలేసింది. దీంతో గుంటూరు మిర్చీ యార్డ్ లో పెరిగాడు మహేష్‌. లోకల్‌ రౌడీలా ఎదిగాడు. ఆయనంటే అందరికి హడల్‌ అనేలా ఉంటుంది. గుంటూరు మిర్చీ మార్కెట్‌లో జీపులో మాస్‌ ఎంట్రీ ఇచ్చాడు మహేష్‌. `చూడగానే మజా వచ్చిందా?.. హార్ట్ బీట్‌ పెరిగిందా? ఈల వేయాలనిపించిందా? అదే రాముగాడు` అనేలా ఆయన డైలాగులతో పరిచయం చేసుకోవడం విశేషం. దీనికి కొనసాగింపుగా మహేష్‌ `పానీగాడు ఏడు బే` అని, లోపల వెయిట్‌ చేస్తున్నాడని చెప్పగా, పని ఆడిది వెయిట్‌ చేసుకుండా ఏం చేస్తాడని మహేష్‌ సిగరేట్‌ విసిరేసి వెళ్లడం హైలైట్‌గా నిలిచింది. ఇందులో మహేష్‌ సెటిల్‌ మెంట్లు చేసే వాడిలా కనిపించాడు. 

ఆ వెంటనే ట్రైలర్‌ లవ్‌, రొమాన్స్ వైపు టర్న్ తీసుకుంది. శ్రీలీలని చూడగానే పడిపోతాడు మహేష్‌. ఆమెని కన్ను మూసి నడుము చూడటం, ఆమె డోర్‌ వద్ద వయ్యారంగా పోజులివ్వడం అదిరిపోయింది. ఆమెని ఉద్దేశించి మహేష్‌ మాట్లాడుతూ, `పానీగాడి కూతురు ఏం ఫిగరే అనగా, ఆమె ఊరికోండి రామూ అంటూ ప్రేమగా పిలుస్తుంది. దీంతో మహేష్‌ `అబ్బా అబ్బా అబ్బా.. అంటూ పదే పదే రిపీట్‌ చేయడం ఫ్యాన్స్  ఈలలు వేసేలా చేసింది. ఇక శ్రీలీల నడుము దాస్తూ, చిరిగిన జీన్స్ లో కనిపించింది. దీనిపై `చింపేసుకుంటారా? వేసుకుని చింపుకుంటారా? ఎక్కడ చింపాలో, ఎంత కనిపించాలో దాని వ్యవహారమే వేరండి ఆయన చెప్పడం అదిరిపోయింది. 

రొమాన్స్ నుంచి యాక్షన్‌ వైపు టర్న్ తీసుకుంది. అగ్గిపెట్టలేదని ఆగిపోయినా అంటూ అగ్గిపుల్లతో కార్లు పేల్చేశాడు మహేష్‌. వరుస బెట్టి యాక్షన్‌ సీన్లతో అదరగొట్టాడు. మీనాక్షి చౌదరి.. అక్కడ మీ కొడుకు చితక్కొడుతున్నాడని చెప్పగా, జయం అదోలా తిరిగి చూడటం, రావు రమేష్‌ రమణ 70ఎంఎం అంటూ పొగడటంతో ఆట చూస్తావా అని మహేష్‌ చెప్పడం నెక్ట్స్ లెవల్ అనిపించేలా ఉంది. విలన్లు జగపతిబాబు, ప్రకాష్‌ రాజ్‌లకు వార్నింగ్ లు ఇవ్వడం, చివరగా `ఆడొక బ్రేకుల్లేని లారీ, ఎవడు ఆపుతాడు అని ప్రకాష్‌ రాజ్‌ చెప్పగా, చివర్లో రమ్యకృష్ణ.. పై నుంచి మహేష్‌ని చూస్తుంది, ఆమెని చూసేందుకు మహేష్‌ ఆగిపోతాడు. అది కాస్త ఎమోషనల్‌గా ఉంది. ట్రైలర్‌ ముగింపు ఎమోషనల్‌గా అనిపించింది. మొత్తానికి పండక్కి అన్ని మసలాలు నూరి రంగరించి తాళింపు వేసి చేసిన సినిమాలా `గుంటూరు కారం` ఉంది. ఫ్యాన్స్ కి అదిరిపోయే ఫీస్ట్ అని చెప్పొచ్చు. ఇక సంక్రాంతికి మహేష్‌ మాస్‌ జాతర నెక్ట్స్ లెవల్‌ లో ఉంటుందని తెలుస్తుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios