‘గుంటూరు కారం’ సెకండ్ సింగిల్ ప్రోమో.. శ్రీలీలాకు మహేశ్ బాబు క్యూట్ ప్రపోజ్.. చూశారా?
మహేశ్ బాబు - శ్రీలీలా జంటగా నటించిన ‘గుంటూరు కారం’ నుంచి సెకండ్ సింగిల్ రాబోతోంది. తాజాగా Oh my Baby ప్రోమోను మేకర్స్ విడుదల చేశారు. మహేశ్ బాబు, శ్రీలీలా మధ్య జరిగిన సీన్ హైప్ పెంచేసింది.
మహేశ్ బాబు (Mahesh Babu) - త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న ‘గుంటూరు కారం’ (Guntur Kaaram) చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మార్కెట్ లోనూ డిమాండ్ ఉంది. హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ నుంచి బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ విడుదలవుతూ వచ్చాయి. ఫస్ట్ సింగిల్ Dum Masala సాంగ్ విడుదలై మాసీవ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.
తాజాగా రెండో పాటపై అప్డేట్ అందించారు. గతంలో అనౌన్స్ చేసిన విధంగానే కొద్ది సేపటి కింద `ఓ మై బేబీ` (Oh My Baby) అంటూ సాగే రెండో పాట ప్రోమోను విడుదల చేశారు. గుంటూరు కారం సెకండ్ సింగిల్ గా వస్తున్న ఈ సాంగ్ పై మంచి హైప్ క్రియేట్ అయ్యింది. ప్రోమో చాలా ఆసక్తికరంగా మారింది. మహేశ్ బాబు, శ్రీలీలా మధ్య సాగిన ఇంట్రడక్షన్ సీన్ ఆకట్టుకుంటోంది. ఆ వెంటనే స్టార్ట్ అయిన బీజీఎం అదిరిపోయింది.
హో మై బేబీ ఫుల్ సాంగ్ పై ఆసక్తిని పెంచేసింది. ఈనెల 13న పూర్తి పాటని విడుదల చేస్తామని యూనిట్ తెలిపింది. ప్రస్తుతం ప్రోమో యూట్యూబ్ లో ట్రెండింగ్ గా మారింది. ఈ చిత్రంలో టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ శ్రీలీలా (Sreeleela)తో పాటు క్రేజీ హీరోయిన్ మీనాక్షి చౌదరి కూడా నటిస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12, 2024న విడుదల కాబోతోంది.