సూపర్ స్టార్ మహేశ్ బాబు Mahesh Babu అభిమానులకు అదిరిపోయే అప్డేట్ అందింది. గుంటూరుకారం Guntur Kaaram నుంచి అసలైన సాంగ్ రాబోతుందంటూ మేకర్స్ అప్డేట్ అందించారు. పోస్టర్ కూడా వదిలారు.
సూపర్ స్టార్ మహేశ్ బాబు- త్రివిక్రమ్ Trivikram కాంబినేషన్ లో 13 ఏళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం ‘గుంటూరు కారం’. ఈ చిత్రం కోసమే ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఎప్పుడో రావాల్సిన మూవీని ఎట్టకేళలకు వచ్చే ఏడాది జనవరిలో విడుదల చేస్తున్నారు. రిలీజ్ కు ఇంకా 20 రోజుల సమయం ఉండటంతో మేకర్స్ ఈ నెల ప్రారంభం నుంచే ప్రమోషన్స్ ను ప్రారంభించింది. ఇందులో భాగంగా అదిరిపోయే అప్డేట్స్ ను అందిస్తున్నారు.
ఇప్పటికే మూవీ నుంచి చాలానే స్పెషల్ పోస్టర్లను విడుదల చేశారు. అలాగే ‘దమ్ మసాలా’ Dum Masala, ‘హో మై బేబీ’ Oh My Baby వంటి సాంగ్స్ కూడా విడుదలై ఆకట్టుకున్నాయి. సంగీత ప్రియులకు సినిమాపై ఆసక్తిని పెంచాయి. ఇక తాజాగా మరో సాంగ్ ను విడుదల చేసేందుకు యూనిట్ సిద్ధమైంది. ఈసారి అలాంటి ఇలాంటి సాంగ్ కాకుండా కాస్తా స్పైసీ అండ్ మాస్ నెంబర్ ను రిలీజ్ చేస్తున్నామని కొద్దిసేపటి కిందనే అప్డేట్ అందించారు.
ఈ సారి రాబోయే సాంగ్ కు వూఫర్స్ బద్దలైపోవాల్సిందేనని, అందుకు సూపర్ ఫ్యాన్స్ సిద్ధంగా ఉండాలని సూచించారు. హై వోల్టేజీ తో కూడిన స్పైపీ, మాస్, హాట్ కలగలిపిన సాంగ్ ను రాబోతుందని హామీనిచ్చారు. దీంతో పాటు క్రేజీ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. మహేశ్ బాబు సూపర్ మాస్ స్టిల్, శ్రీలీలా మూమెంట్ తో పోస్టర్ అదిరిపోయింది. దీంతో సాంగ్ పై ఆసక్తి నెలకొంది. ఇక ఎప్పటి నుంచో ‘గుంటూరు కారం’ నుంచి అసలైన అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. తాజాగా కావాల్సిన సాంగ్ పై అనౌన్స్ మెంట్ ఇచ్చారు. అయితే ఈ సాంగ్ ఎప్పుడు వస్తుందనే దానిపై స్పష్టమైన డేట్ అంటూ ఇవ్వలేదు. నెక్ట్స్ అప్డేట్ లో రానుంది.
చాలా కాలం తర్వాత త్రివిక్రమ్ - మహేశ్ బాబు కాంబినేషన్ లో వస్తున్న చిత్రం కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. గతంలో ‘అతడు’, ‘ఖలేజా’ వచ్చిన విషయం తెలిసిందే. ఇక మూడోసారి వీరి కాంబో ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని బ్యానర్ పై నిర్మిస్తున్నారు. శ్రీలీలా (Sreeleela), మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) హీరోయిన్లుగా నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. 2024 జనవరి 12న సంక్రాంతి కానుకగా గ్రాండ్ గా విడుదల కాబోతోంది.
