‘దమ్ మసాలా బిర్యానీ.. గుద్దిపారేయ్ గుంటూర్ని’... ‘గుంటూరు కారం’ ఫస్ట్ సింగిల్ వచ్చేసింది
‘గుంటూరు కారం’ నుంచి రీసెంట్ ఫస్ట్ సాంగ్ అప్డేట్ అందింది. ప్రోమో కూడా విడుదలై ఆకట్టుకుంది. తాజాగా ‘దమ్ మసాలా’ పూర్తి సాంగ్ రిలీజ్ అయ్యింది. లిరిక్స్,, ట్యూన్ క్యాచీగా ఉన్నాయి.
సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న చిత్రం Guntur Kaaram. 13 ఏళ్ల తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ - మహేశ్ బాబు కాంబోలో వస్తున్న చిత్రం కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎట్టకేళలకు వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కాబోతోంది. విడుదలకు ఇంకా రెండు నెలల సమయం ఉండటంతో ఇప్పటి నుంచే హైప్ పెంచేస్తున్నారు.
ఈ సందర్భంగా ‘గుంటూరు కారం’ మొదటి పాటను తాజాగా యూనిట్ విడుదల చేసింది. ఇప్పటికే ప్రోమో వచ్చిన విషయం తెలిసిందే. కొద్దిసేపటి కింద Dum Masala ఫుల్ సాంగ్ ను యూనిట్ విడుదల చేసింది. లిరికల్ వీడియో ఆకట్టుకుంటోంది. మాస్ బాబు మాస్ అవతార్ తో రచ్చ చేయడం ఖామయని తెలుస్తోంది. ‘దమ్ మసాలా’ సాంగ్ ను మహేశ్ బాబు మాస్ ను మరింత లేపేలా రూపొందించారు.
ముఖ్యంగా సాంగ్ లిరిక్స్ ఆకట్టుకుంటున్నాయి. సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి మాస్ లిరిక్స్ ను అందించారు. సంజిత్ హెగ్దే, థమన్ అద్భుతంగా పాడారు. థమన్ అందించిన ట్యూన్ చాలా క్యాచీగా ఉంది. ఈ చిత్రానికి ఇదే హైలెట్ సాంగ్ గా కనిపిస్తోంది. మున్ముందు మరిన్ని సాంగ్స్ నూ కూడా విడుదల చేసేందుకు యూనిట్ సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఫస్ట్ సింగిల్ యూట్యూబ్ లో అదరగొడుతోంది.
‘గూంటురు కారం’ చిత్రాన్ని త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈరోజు త్రివిక్రమ్ పుట్టిన రోజు. ఇవాళే ‘దమ్ మసాలా’ ఫుల్ సాంగ్ రావడం విశేషం. ఈ సినిమాను హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందిస్తున్నారు. టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ శ్రీలీలా, క్రేజీ హీరోయిన్ మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12, 2024న విడుదల కాబోతోంది.