Asianet News TeluguAsianet News Telugu

#GunturKaaram:ఓపినింగ్ డే ..అడ్వాన్స్ బుక్కింగ్ రిపోర్ట్,షాకయ్యే లెక్కలు

 ఈ సంక్రాంతికి  ఘాటుతో పసందైన దమ్‌ మసాలా బిర్యానీ వడ్డించేందుకు సిద్ధమవు  తున్నారు మహేశ్‌బాబు, త్రివిక్రమ్‌. ఈ ఇద్దరి కాంబినేషన్ లో రూపొందిన ఈ మాస్‌ యాక్షన్‌ చిత్రాన్ని హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తోంది

Guntur Kaaram advance bookings report for opening day JSP
Author
First Published Jan 11, 2024, 11:05 AM IST

ఈ సంక్రాంతికి తెలుగులో రిలీజ్ అవుతున్న సినిమాలలో‘గుంటూరు కారం’అడ్వాన్స్ బుక్కిగ్స్ తో ట్రెండింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఓవర్ సీస్ లో ఇప్పటికే అడ్వాన్స్ లుతో అదరకొడుతున్న మహేష్ తెలుగు రాష్ట్రాల్లో అయితే ఇంక చెప్పక్కర్లేదు. గుంటూరు కారం గురించిన రచ్చే వినపడుతోంది. ఈ క్రమంలో ఫస్ట్ డే అడ్వాన్స్ బుక్కింగ్స్ రిపోర్ట్ బయిటకు వచ్చింది. సెన్సేషన్ అనే పదం ఒక్కటే సరిపోతుంది. ఆ వివరాలు చూద్దాం.

ట్రేడ్ నుంచి అందుతున్న సమాచారం మేరకు ఇండియాలో నేషనల్ ప్లెక్స్ లలో అడ్వాన్స్ బుక్కింగ్ గ్రాస్ 4.75Cr. ఇది ఓ తెలుగు హీరోకు ఫెంటాస్టిక్ ఎఛీవ్ మెంట్ అని చెప్పాలి. గుంటూరు కారం టోటల్ హైదరాబాద్ సిటీ అడ్వాన్స్ బుక్కింగ్స్ గ్రాస్ మేజర్ బుక్కింగ్స్ పోర్టల్స్ నుంచి 9.2 Cr కన్నా ఎక్కువ  వచ్చింది. మిగతా చిన్నా చితకా బుక్కింగ్ పోర్టర్స్ నుంచి వచ్చిన అడ్వాన్స్ బుక్కింగ్స్ కూడా కలిపితే  10Cr రీచ్ అవుతుంది. అంటే ఓవర్ సీస్ అడ్వాన్స్ బుక్కింగ్ కూడా 1.2M [10Cr] ఉండబోతోందని అంచనా. దాంతో మొత్తం 20  Cr అడ్వాన్స్ బుక్కింగ్ లు మొదటి రోజు అయ్యాయన్నమాట. ఇది మామూలు విషయం కాదు. 
 
ఇప్పటిదాకా అందిన సమాచారం మేరకు నార్త్ అమెరికాలో ప్రీమియర్స్ కు అడ్వాన్స్ బుక్కింగ్ లు అదిరిపోతున్నాయి. ఇప్పటికే $800K రేంజిని రీచ్ అయ్యింది. $1.5M+ వస్తుందని అంచనా వేస్తున్నారు. టోటల్ ప్రీమియర్స్  + ఓపినింగ్ డే అడ్వాన్స్ బుక్కింగ్స్ $950K దాటుతాయంటున్నారు. ఆ రోజున ఇంకొన్ని కొత్త షోలు, లొకేషన్స్ యాడ్ అవుతాయని అంచనా వేస్తున్నారు. UK,ఆస్ట్రేలియా ఇంకా ఇతర రీజియన్స్ లో యావరేజ్ ప్రీ రిలీజ్ సేల్స్ ఫస్డ్ డే  250K ని రీచ్ అవుతాయని భావిస్తున్నారు. టోటల్ గా మొదటి రోజు ప్రీ రిలీజ్ ఓవర్ సీస్ సేల్స్ రేంజ్ 1.2M [10Cr] ఉండబోతోందని అంచనా. మిడిల్ ఈస్ట్ బుక్కింగ్స్ ఓపెన్ అయ్యితే పెద్ద జంప్ ఉంటుంది. 

ఏదైమైనా ఈ సంక్రాంతికి  ఘాటుతో పసందైన దమ్‌ మసాలా బిర్యానీ వడ్డించేందుకు సిద్ధమవు  తున్నారు మహేశ్‌బాబు, త్రివిక్రమ్‌. ఈ ఇద్దరి కాంబినేషన్ లో రూపొందిన ఈ మాస్‌ యాక్షన్‌ చిత్రాన్ని హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ‘‘సర్రు మండుతాది బాబు గొడ్డు కారం.. గిర్ర తిరుగుతాది ఈడి తోటి బేరం’’ అనే పాట ఎక్కడ చూసినా వినిపిస్తోంది. ఆ పాటను పాడేసుకుంటూ అడ్వాన్స్ బుక్కింగ్స్ తో హోరెత్తిస్తున్నారు అబిమానులు.  
 
  నిర్మాత నాగవంశీ (Naga Vamsi)మాట్లాడుతూ... ‘‘చాలా కాలం నుంచి మహేశ్‌తో సినిమా చేయాలనుకుంటున్నా. ‘గుంటూరుకారం’తో అది నెరవేరింది. సినిమా అద్భుతంగా వచ్చింది. తమన్‌ మ్యూజిక్‌ మరోస్థాయిలో ఉండనుంది. ఫస్టాఫ్‌ రీరికార్డింగ్‌ పూర్తైంది. సంక్రాంతికి పర్‌ఫెక్ట్‌ మూవీ ఇది. ఫస్టాఫ్‌లో వచ్చే ఫైట్‌లో ఇద్దరు సూపర్‌స్టార్స్‌ను చూస్తున్న ఫీల్‌ కలుగుతుంది. చివరి 45 నిమిషాలు సినిమా అదిరిపోతుంది.  ’’ అని ఆయన చెప్పారు. త్రివిక్రమ్‌ - మహేశ్‌ హ్యాట్రిక్‌ కాంబోలో వస్తోన్న చిత్రమిది. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్. ఈ చిత్రానికి ఫైట్స్‌: రామ్‌-లక్ష్మణ్‌, కూర్పు: నవీన్‌ నూలి, ఛాయాగ్రహణం: మనోజ్‌ పరమహంస. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios