రాజమౌళి తెరకెక్కించిన దృశ్య కావ్యం బాహుబలి దేశవ్యాప్తంగానే కాక ప్రపంచమంతా ఎంత క్రేజీగా మారిందో తెలిసిందే. ఈ క్రేజ్ తో మరే సినిమా చేరలేనన్ని రికార్డులు బాహుబలి సొంతం చేసుకుంటోంది. కలెక్షన్స్ పరంగానూ దూసుకెళ్తున్న బాహుబలి సినిమాను ప్రతి ఒక్కరు థియేటర్ లోనే చూసి ఆనందించాలని భావిస్తున్నారు. అందుకే రోజు రోజుకు బాహుబలి క్రేజ్ పెరుగుతోంది.

 

బాహుబలి సక్సెస్ పట్ల సినీపరిశ్రమ పెద్దలు, చిన్నలు అంతా రాజమౌళి అండ్ కో కు ప్రసంశల జల్లు కురిపిస్తున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు క్రిష్, రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్లు కూడా అభినందనలు తెలిపారు.

 

తాజాగా బాహుబలి టీమ్ కు గుణశేఖర్ కూడా అభినందనలు తెలిపారు. తన సోషల్ మీడియా ఎకౌంట్ ట్విట్టర్ లో రాజమౌళి, ప్రబాస్, అనుష్క ఇలా అందరికీ అభినందనలు తెలిపాడు గుణశేఖర్. అయితే బాహుబలి సినిమా గురించి రాజమౌళిని ప్రశంసిస్తూ రాసిన కమెంట్స్ లో... సింపుల్ కథకు అద్భుతమైన దృశ్యాలతో ప్రాణంపోసి తెర రూపమిచ్చి జనాన్ని ఎలా మెస్మరైజ్ చేయచ్చో బాహుబలితో నిరూపించారని గుణ శేఖర్ పేర్కొన్నారు. అయితే... అది బాహుబలి అభిమానులకు ఆగ్రహం తెప్పిస్తోంది.

 

5 ఏళ్లపాటు కష్టపడి తెరకెక్కించిన బాహుబలి సినిమా కథను ఒక సింపుల్ కథ అనటం సరికాదని బాహుబలి అభిమానులు అంటున్నారు. సోషల్ మీడియాలో నెగెటివ్ కమెంట్స్ వెల్లువెత్తుతుండటంతో గుణ శేఖర్ కూడా వెంటనే తేరుకుని ఆ కమెంట్ ను సవరించారని తెలుస్తోంది. తొందర పడి మాట జారడమెందుకు, మళ్లీ పోస్ట్ డిలీట్ చేయడమెందుకు.