Asianet News TeluguAsianet News Telugu

భాక్సాఫీస్: ‘గల్లీ రౌడీ' గల్లంతేనా,ఎంత పెట్టారు,ఎంత వచ్చింది?


సందీప్ కిషన్ హీరోగా జీ నాగేశ్వర్‌రెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘గల్లీ రౌడీ'. కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాను కోన ఫిల్మ్ కార్పోరేషన్ సమర్పణలో విశాఖపట్నం ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ నిర్మించారు.  

Gully Rowdy has turned out to be a flop
Author
Hyderabad, First Published Sep 20, 2021, 3:06 PM IST

సక్సెస్ కోసం గత కొంతకాలంగా ఎదురుచూస్తున్న సందీప్ కిషన్ తాజా చిత్రం ‘గల్లీ రౌడీ'. కోవిడ్ తో విసుగెత్తి ఉన్న జనాలకి కామెడీ అనేది మంచి టానిక్ లా పనిచేస్తుందని, భాక్సాఫిస్ దగ్గర బాగా వర్కవుట్ అవుతుందని నమ్మి చేసారు. అందులోనూ కామెడీ చిత్రాల దర్శకుడుగా పేరు తెచ్చుకున్న నాగేశ్వరరెడ్డి, రచయిత కోన వెంకట్ కలసి పనిచేయటం కూడా సినిమాపై క్రేజ్ పెంచింది. రిలీజ్ కు ముందు విడుదలైన టీజర్, ట్రైలర్ విడుదల తర్వాత ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. దీంతో ఈ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా రూ. 2.75 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని ట్రేడ్ వర్గాల అంచనా.

ఈ నేపధ్యంలో రిలీజ్ అయిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంటుంది అంతా అనుకున్నారు. కానీ  నైజాం ఏరియాలో అండర్ పెర్ఫార్మ్ చేయగా ఆంధ్రలో టికెట్ రేట్లు తక్కువగా ఉండటం 50% ఆక్యుపెన్సీ వలన ఓవరాల్ గా…వర్కవుట్ కాలేదు. ఓపినింగ్స్ మొదటి రోజు తక్కువగానే వచ్చాయి. రెండో రోజు కూడా అదే పరిస్దితి రిపీట్ అయ్యింది. వీకెండ్ కూడా ఏమీ ఫలితం కనపడలేదు.  బాగా డ్రాప్ కనపడింది.  సాధారణంగా మొదటి రోజు తో పోల్చితే రెండో రోజు డ్రాప్ ఇలాంటి యావరేజ్ సినిమాలకు కామనే కానీ ఈ సినిమా ఆల్ మోస్ట్ 50% రేంజ్ లో డ్రాప్స్ అవటం షాక్ ఇచ్చింది. దాంతో బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కూడా రాకపోవచ్చని తేలిపోయింది.

 సినిమాను మొత్తం మీద 2.75 కోట్ల రేంజ్ లో అమ్మటంతో   సినిమాకు  3 కోట్ల రేంజ్ టార్గెట్ ఫిక్సైంది. కానీ కలెక్షన్స్ చూస్తూంటే దరిదాపుల్లోకి కూడా పరిస్దితి కనపడటం లేదు. దాంతో సినిమా ఫ్లాఫ్ గా ట్రేడ్ లో నమోదు అయ్యింది. అప్పటికీ ఈ సినిమాకు ఓ రేంజిలో ప్రమోషన్ చేసారు. కానీ అసలే ఓ మాదిరి టాక్ ఉన్న సినిమాలు చూడటానికి థియోటర్  కు జనం రావటానికి ఉత్సాహం చూపటం లేదు. అలాంటిది బాగో లేదు అని మౌత్ టాక్, రివ్యూలు వచ్చాక కష్టమే అంటున్నారు.

సందీప్ కిషన్ హీరోగా జీ నాగేశ్వర్‌రెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘గల్లీ రౌడీ'. కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాను కోన ఫిల్మ్ కార్పోరేషన్ సమర్పణలో విశాఖపట్నం ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ నిర్మించారు. ఇందులో నేహా శెట్టి హీరోయిన్ నటించింది. బాబీ సింహా, రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిశోర్‌లు కీలక పాత్రలను పోషించారు. సాయి కార్తీక్ సంగీతం సమకూర్చాడు.

సందీప్ కిషన్ నటించిన చిత్రాల్లో మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో వసూలైన షేర్లు చూసుకుంటే.. అన్నింటి కంటే ముందు ‘నిను వీడని నీడను నేనే' ఉంది. దీనికి రూ. 90 లక్షలు వచ్చాయి. ఆ తర్వాత రూ. 76 లక్షలతో ‘ఏ1 ఎక్స్‌ప్రెస్' ఉంది. ఇక, వీటి తర్వాత ఇప్పుడు ‘గల్లీ రౌడీ' మూవీ రూ. 61 లక్షలు రాబట్టింది. ‘తెనాలి రామకృష్ణ'కు రూ. 55 లక్షలు వచ్చాయి.

Follow Us:
Download App:
  • android
  • ios