రణ్‌వీర్‌ సింగ్‌, ఆలియా భట్‌ జంటగా నటించిన మ్యూజికల్ డ్రామా సినిమా ‘గల్లీ బాయ్‌’. దేశీ ర్యాప్‌ కల్చర్‌ సంగీత నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లు రాబడుతున్న సంగతి తెలిసిందే. ప్రేమికుల రోజు సందర్భంగా గత గురువారం విడుదలైన ఈ సినిమా కలెక్షన్స్ లో రికార్డ్ లు క్రియేట్ చేస్తోంది. 

జోయా అక్తర్ దర్శకత‍్వంలో రూపొందిన ఈ సినిమాలో రణ్‌వీర్‌ పోషించిన రాప్‌ సింగర్‌, గల్లీ బాయ్‌ పాత్రకు సూపర్‌ రెస్పాన్స్‌ వస్తోంది. దీంతో ఇతర భాషల్లో ఈ సినిమాను రీమేక్‌ చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి.

అందులో భాగంగా తెలుగులోనూ గల్లీ బాయ్‌ని రీమేక్‌ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా మెగా ఫ్యామిలీ హీరోలు ఈ రీమేక్‌లో నటించేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. 

ప్రస్తుతం కిశోర్‌ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్ర లహరి షూటింగ్‌లో బిజీగా ఉన్న సాయి ధరమ్‌ తేజ్‌ ఈ రీమేక్‌లో నటించేందకు ఇంట్రస్ట్ చూపిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.  మరో ప్రక్క ఈ సినిమా తెలుగు రీమేక్ హక్కులను సొంతం చేసుకుని, వైష్ణవ్ తేజ్ తో గాని తెరపైకి తీసుకెళ్లాలనే ఆలోచనలో అల్లు అరవింద్ వున్నట్టుగా సమాచారం. అందుకు సంబంధించిన పనులు మొదలయ్యాయని కూడా చెప్పుకుంటున్నారు.