సూపర్ స్టార్ మహేష్ బాబు ఆఫీస్ లో జీఎస్టీ అధికారులు తనిఖీలు చేసిన సంగతి తెలిసిందే. అతడి బ్యాంక్ ఖాతాలను సీజ్ చేయడంతో పాటు అకౌంట్లలో ఉన్న డబ్బుని స్వాధీనం చేసుకున్నారు.

తనకు ఎలాంటి లీగల్ నోటీసులు ఇవ్వకుండా అధికారులు బ్యాంక్ ఖాతాలను స్తంభింపజేసారంటూ మహేష్ లీగల్ గా ప్రొసీడ్ అవుతున్నారు. ఇది ఇలా ఉండగా.. మహేష్ బాబు అకౌంట్ లో ఉన్న డబ్బును ప్రభుత్వ ఖాతాలో జమ చేసినట్లు జీఎస్టీ కమిషనరేట్ వెల్లడించింది.

పదేళ్ళ క్రితం మహేష్ బాబు బాకీ పడ్డ రూ.73.11 లక్షలు వసూలు చేసినట్లు స్పష్టం చేసింది. జీఎస్టీ కమీషనరేట్, 1994 ఆర్ధిక చట్టం.. సెక్షన్ 87 ప్రకారం బకాయిలు వసూలు చేసినట్లు జీఎస్టీ కమిషనర్ స్పష్టం చేసింది. అయితే మహేష్ బాబు మాత్రం 2007-2008 ఆర్ధిక సంవత్సరానికి గాను ప్రకటనల ద్వారా సంపాదించిన డబ్బు పన్ను పరిధిలోకి రాదని స్పష్టం చేశారు.

అంబాసిడర్ సేవలను పన్ను పరిధిలోకి సెక్షన్ 65 ద్వారా 2010 జూలై 1వ తేదీ నుండి చేర్చినట్లు, మహేష్ బాబు చట్టపరమైన నియమాలకు లోబడే ఉన్నారని మహేష్ బాబు లీగల్ టీమ్ వెల్లడించింది. 

జీఎస్టీ కమిషనర్ కు హీరో మహేష్ బాబు లీగల్ నోటీసులు

ఫ్యాన్స్ హర్ట్.. ఎంజాయ్ చేస్తోన్న మహేష్!

హీరో మహేష్ బాబుకు జిఎస్టీ షాక్: ఖాతాలు ఫ్రీజ్

ఖాతాలు ఫ్రీజ్: ఫ్యామిలీతో సరదాగా మహేష్ బాబు