మళ్లీ వాయిదాపడ్డ సిద్దార్థ్ "గృహం" రిలీజ్

gruham release postponed again
Highlights

  • సిద్దార్థ్ యాండ్రియా జంటగా నటించిన గృహం
  • తెలుగులో విడుదలకు పలు మార్లు ఆటంకాలు
  • తాజాగా మళ్లీ వాయిదాపడ్డ సిద్దార్థ్ "గృహం" రిలీజ్

 

సిద్ధార్థ్, ఆండ్రియా జంటగా నటించిన హరర్ అండ్ థ్రిల్లర్ మూవీ ‘గృహం’ ఇటీవల తమిళ్‌లో విడుదలైన విజయాన్ని అందుకుంది. కాగా ఈ చిత్రం నవంబర్ 10న తెలుగులో విడుదల చేస్తున్నట్టు ప్రకటించనప్పటికీ థియేటర్స్ సమస్య తలెత్తడంతో మరోసారి వాయిదా పడింది ‘గృహం’.టాలీవుడ్‌లో బొమ్మరిల్లు చిత్రంలో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సిద్దార్థ్ తెలుగులో సక్సెస్ కొట్టి చాలా ఏళ్లయ్యింది. బాయ్స్, యువ, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు లాంటి హిట్ చిత్రాల్లో నటించి తెలుగులో తనకుంటూ ఓ ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు హీరో సిద్దార్థ. ఆ తరువాత కొంచెం ఇష్టం కొంచెం కష్టం, ఓ మై ఫ్రెండ్, అనగనగా ఓ ధీరుడు లాంటి సినిమాలు నిరాశ పరచడంతో చివరిగా సంథింగ్ సంథింగ్ అంటూ అభిమానుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకోకపోవడంతో సుమారు నాలుగేళ్లపాటు లాంగ్ గ్యాప్ తీసుకున్న సిద్దార్థ తాజాగా ‘గృహం’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రీఎంట్రీ ఇస్తున్నాడు. కాగా ఈ చిత్రాన్ని నవంబర్ 3న హిందీ, తమిళ్, తెలుగు భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయాలని భావించినప్పటికీ కొని అనివార్య కారణాలవల్ల నవంబర్ 10కి వాయిదా వేశారు. కాగా ప్రస్తుతం మరోసారి ఈ మూవీ వాయిదా పడింది.నవంబర్ 10న మంచు మనోజ్ నటిస్తున్న ఒక్కడు మిగిలాడు, సందీప్ కిషన్ నటిస్తున్న ‘కేరాఫ్ సూర్య’ చిత్రాలతో పాటు విశాల్ ‘డిటెక్టివ్’ చిత్రాలు లైన్‌లో ఉండటంతో తెలుగులో థియేటర్స్ కొరత ఏర్పడింది. ముఖ్యంగా హైదరాబాద్‌లో థియేటర్స్ దొరకడం గగనంగా మారింది. ఇప్పటికే భారీ అంచనాలతో విడుదలవుతున్న మంచు మనోజ్ లేటెస్ట్ మూవీ ‘ఒక్కడు మిగిలాడు’ చిత్రానికి హైదరాబాద్‌లో ఒకే ఒక్కథియేటర్‌ను కేటాయించడంతో ఆయన అభిమానులు రచ్చ చేస్తున్నారు. ఇక సందీప్ కిషన్ చిత్రానికి సైతం థియేటర్స్ దొరకడం కష్టంగానే మారింది. ఈసందర్భంతో సిద్దార్థ్ నటించిన ‘గృహం’ చిత్రాన్ని విడుదలకు థియేటర్స్ సమస్య ఏర్పడటంతో వాయిదా వేసుకున్నారు. త్వరలో ఈ మూవీ కొత్త రిలీజ్ డేట్‌ను ప్రకటించే అవకాశం ఉంది.


మిలింద్ రావు దర్శకత్వం వహించిన ‘గృహం’ ఈమూవీకి సిద్దార్థ్ స్క్రీన్ ప్లే, కథ సహకారం అందించడం విశేషం. ఈ చిత్ర కథ మొత్తం ఆత్మల చుట్టూ తిరుగుతుంది. జెన్నీ అనే అమ్మాయి గత జన్మకి ఈ జన్మకి మధ్య సంఘర్షణే చిత్ర కథాంశంగా తెలుస్తోంది.

loader