సూర్య హీరోగా నటించిన `ఆకాశం నీ మధ్దురా` చిత్రం దీపావళి కానుకగా గురువారం విడుదలైంది. దీనికి మంచి స్పందన లభిస్తుంది. మోహన్‌బాబు, మాధవన్‌ వంటి ప్రముఖులు సినిమాని, సూర్య నటనని ప్రశంసిస్తున్నారు. తాజాగా ఏకంగా ఎయిర్‌ డెక్కన్‌ అధినేత జీఆర్‌ గోపీనాథ్‌ స్పందించారు.

ఎయిర్‌ డెక్కన్‌ అధినేత జీఆర్‌ గోపీనాథ్‌ జీవితం ఆధారంగా రాసిన ఆటోబయోగ్రఫీ `సింప్లి ఫ్లై` పుస్తకాన్ని ఆధారం చేసుకుని `సి `ఆకాశం నీ హద్దురా` చిత్రం రూపొందింది. గోపీనాథ్‌గా హీరో సూర్య నటించిన ఈ సినిమాకి సుధా కొంగర ప్రసాద్‌ దర్శకత్వం వహించారు. దీపావళి కానుకగా గురువారం ఈ సినిమా విడుదలైంది. దీనికి మంచి స్పందన లభిస్తుంది. మోహన్‌బాబు, మాధవన్‌ వంటి ప్రముఖులు సినిమాని, సూర్య నటనని ప్రశంసిస్తున్నారు. 

తాజాగా ఏకంగా ఎయిర్‌ డెక్కన్‌ అధినేత జీఆర్‌ గోపీనాథ్‌ స్పందించారు. నవ్వలేదు.. ఏడవలేదు.. కానీ అద్భుతంగా ఉందని తెలిపారు. ఆయన ట్విట్టర్‌ ద్వారా స్పందిస్తూ, `గత రాత్రి సినిమా చూశా. రోలర్‌ కోస్టర్‌ లా అనిపించింది. ఫిక్షన్‌ ఎక్కువగా ఉన్నప్పటికీ నా పుస్తకంలోని ఎమోషన్స్ ని చాలా బాగా క్యాప్చర్‌ చేశారు. నాకు నవ్వు రాలేదు. ఏడుపు కూడా రాలేదు. కానీ గతం గుర్తుకొచ్చింది` అని అన్నారు. 

ఇంకా చెబుతూ, `అసమానతలతో వెనుకబడిన గ్రామీణ నేపథ్యం ఉన్న ఒక పారిశ్రామికవేత్త పోరాటాలు.. కష్టాలకు వ్యతిరేకంగా సాధించిన నిజమైన విజయం ఇది. నా భార్య భార్గవి పాత్రని అపర్ణ బాగా చేసింది. తన స్వభుద్ధితో ఆలోచించే బలమైన మనస్తత్వంతోపాటు మృదుస్వభావి. గ్రామీణ మహిళలకు స్ఫూర్తినిచ్చే మనస్తత్వం కల వ్యక్తిగా చక్కగా చూపించారు. తన కలను నిజం చేసుకునే ఓ పిచ్చి, ప్యాషన్‌తో వ్యాపారవేత్తగా ఎలా ఎదిగాడనేది చూపించే నా పాత్రని సూర్య అద్బుతంగా చేశారు. దర్శకురాలు సుధా కొంగరకి హ్యాట్సాఫ్‌. సూర్య, అపర్ణ పాత్రలను బాగా బ్యాలెన్స్ చేశారు` అని పేర్కొంది. 

Scroll to load tweet…
Scroll to load tweet…
Scroll to load tweet…
Scroll to load tweet…
Scroll to load tweet…