విజయ్ సినిమా లేట్ అవ్వడంతో చిన్నప్పటి ఐశ్వర్యతో సినిమా
ఆమెను ప్రధాన పాత్రలో పెట్టి ఓ హై స్కూల్ మ్యూజికల్ తరహా సినిమా చేయబోతున్నట్లు సమాచారం. సితారా బ్యానర్ లో రూపొందే ఈ సినిమాకు .. అనిరుధ్ మ్యూజిక్ అందించనున్నారు.

ఒక హీరోతో కమిటయ్యాక...ఆ డేట్స్ వచ్చేదాకా డైరక్టర్స్ వెయిట్ చేస్తూంటారు. అయితే ఆ వెయిటింగ్ అనేది మరీ ఎక్కువ కాలం అయితే ఈ లోగా మరో ప్రాజెక్టు లాగేయిచ్చు కదా...అదే గౌతమ్ తిన్ననూరు చేయబోతున్నారు. వాస్తవానికి విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్‌లో ఓ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఎనౌన్సమెంట్ వచ్చింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వీడీ 12 అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతోన్న ఈ సినిమా బడ్జెట్‌పై నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. వందకోట్లకుపైగా బడ్జెట్‌తో విజయ్, గౌతమ్ తిన్ననూరి మూవీని తెరకెక్కిస్తున్నామని తెలిపాడు. అయితే విజయ్ దేవరకొండ డేట్స్ దొరికేలా లేవు. దాంతో వేరే ప్రాజెక్టు ని డైరక్టర్ మొదలెట్టినట్లు సమాచారం.
మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ...గౌతమ్ తిన్ననూరు ఆ మధ్యన ఓటిటి కోసం ఓ చిన్న కథ రాసారు. నాగ వంశీ ఆ సినిమాని తమ బ్యానర్ పై చేద్దామనుకున్నారు. వేరే డైరక్టర్ తో షూట్ స్టార్ట్ చేసారు. అయితే అవుట్ ఫుట్ అనుకున్న స్దాయిలో రాలేదని , గౌతమ్ తిన్ననూరినే సీన్ లోకి తెచ్చారు. విజయ్ దేవరకొండతో అనుకున్న చిత్రం లేట్ అవుతూండటంతో ఈ డెసిషన్ తీసుకున్నట్లు సమాచారం. ఈ సినిమాలో మణిరత్నం పొన్నియన్ సెల్వన్ #PS1 లో చేసిన సారా అర్జున్ ప్రధాన పాత్రలో కనిపించనుంది. ఆమె ఆ చిత్రంలో చిన్నప్పటి ఐశ్వర్యారాయ్ గా కనిపించింది. ఇప్పుడు ఆమెను ప్రధాన పాత్రలో పెట్టి ఓ హై స్కూల్ మ్యూజికల్ తరహా సినిమా చేయబోతున్నట్లు సమాచారం. సితారా బ్యానర్ లో రూపొందే ఈ సినిమాకు .. అనిరుధ్ మ్యూజిక్ అందించనున్నారు.
‘పొన్నియన్ సెల్వన్’రెండో భాగం పీఎస్ 2 సినిమా చూసిన ప్రతి ఒక్కరు ఒక చైల్డ్ ఆర్టిస్ట్ గురించి మాట్లాడారు. ఆమే చిన్నప్పటి ఐశ్వర్యరాయ్. ఈ చిత్రంలో నెగెటివ్ షేడ్స్ ఉన్న నందిని పాత్రలో ఐశ్వర్యరాయ్ నటించిన సంగతి తెలిసిందే. పార్ట్2 లో ఆ పాత్రకు ప్లాష్‌బ్యాక్ ఉంటుంది. అందులో టీనేజ్ నందినిగా ఐశ్వర్య కంటే అందంగా, చక్కగా నటించిన ఓ చైల్డ్ ఆర్టిస్ట్. ఆమె పేరు సారా అర్జున్. ఇంతకు ముందు కూడా ఆమె సినిమాలో యాక్ట్ చేసింది. విక్రమ్, అనుష్క శెట్టి జంటగా నటించిన ‘నాన్న’ సినిమాలో విక్రమ్‌కు కూతురిగా నటించిన క్యూటీయే ఈ సారా అర్జున్. మతి స్థిమితం లేని నాన్న ప్రేమను అర్థం చేసుకునే కూతురిగా సారా నటన అద్భుతమని అన్నారు అంతా. అప్పుడు సారా వయసు కేలవలం ఐదేళ్లు మాత్రమే.
ఆ తర్వాత చాలా సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించినా .. పొన్నియన్ సెల్వన్‌లో చిన్నప్పటి విక్రమ్‌కు ప్రేయసిగా నటించి మెప్పించటంతో ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చింది. ఈ సినిమా చూసినవారికి చాలా రోజుల పాటు ఆ పాత్ర గుర్తుండిపోతుంది. అంతేకాదు ఆమె అందం, అభినయం చూస్తే.. త్వరలోనే స్టార్ హీరోయిన్ అవుతుందని అందరూ అన్నారు. ఇప్పుడు తెలుగులో సినిమా వస్తోంది.