మరికొన్ని గంటల్లోనే పవర్ స్టార్ భీమ్లా నాయక్ గా థియేటర్స్ లో తన ప్రతాపం చూపించబోతున్నాడు. కానీ ఏపీలో పరిస్థితులు మాత్రం భీమ్లా నాయక్ చిత్రానికి అంత అనుకూలంగా ఉన్నట్లు కనిపించడం లేదు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, భల్లాల దేవుడు రానా దగ్గుబాటి కలసి నటిస్తున్న చిత్రం భీమ్లా నాయక్. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ అభిమానులు భీమ్లా నాయక్ ఫీవర్ తో ఊగిపోతున్నారు. పవన్ కళ్యాణ్ సినిమా విడుదలవుతుంటే హంగామా ఒక రేంజ్ లో ఉంటుంది. అమలాపురం నుంచి అమెరికా వరకు పవన్ ఫ్యాన్స్ భీమ్లా నాయక్ జపం చేస్తున్నారు. హైదరాబాద్ లోని యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో బుధవారం జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ విజయవంతం అయింది.
ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విడుదల చేసిన కొత్త ట్రైలర్ ఫ్యాన్స్ కి మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది. దీనితో భీమ్లా నాయక్ గ్రాండ్ రిలీజ్ కి అంతా సెట్ అయింది. మరికొన్ని గంటల్లోనే పవర్ స్టార్ భీమ్లా నాయక్ గా థియేటర్స్ లో తన ప్రతాపం చూపించబోతున్నాడు. కానీ ఏపీలో పరిస్థితులు మాత్రం భీమ్లా నాయక్ చిత్రానికి అంత అనుకూలంగా ఉన్నట్లు కనిపించడం లేదు.
ఏపీలో తగ్గించిన టికెట్ విషయంలో మరోసారి ప్రభుత్వం కఠిన నిబంధనలు అమలుచేయబోతోంది. తగ్గించిన టికెట్ ధరలకే థియేటర్ యాజమాన్యాలు టికెట్స్ విక్రయించాలని ఆదేశాలు పంపారు. అదనపు షోలు ప్రదర్శించకూడదని కఠిన నిబంధనలు విధించారు. అఖండ, బంగార్రాజు లాంటి చిత్రాలకు ప్రభుత్వం చూసి చూడనట్లుగా వదిలేసింది.
కానీ భీమ్లా నాయక్ రిలీజ్ అవుతుండడంతో రాష్ట్ర యంత్రాంగం కఠిన నిబంధనల్ని అమలులోకి తెచ్చింది. జీవో 35ని కఠినంగా అమలు చేయాలని రాష్ట్ర చీఫ్ సెక్రటరీ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు పంపినట్లు తెలుస్తోంది. దీనితో కలెక్టర్లు భీమ్లా నాయక్ చిత్ర ప్రదర్శనని మానిటరింగ్ చేస్తున్నారు.
థియేటర్స్ లో రెవెన్యూ అధికారి, పోలీస్ అధికారి స్వయంగా విజిట్ చేసేలా ఆదేశాలు అందినట్లు తెలుస్తోంది. దీనితో థియేటర్ యాజమాన్యాలు, బయ్యర్లు ఆందోళనలో ఉన్నట్లు తెలుస్తోంది. నిబంధనలు కఠినంగా అమలైతే కనీసం భీమ్లా నాయక్ చిత్రానికి 15 నుంచి 20 కోట్ల లాస్ తప్పదనే ప్రచారం జరుగుతోంది.
ఏది ఏమైనా అటు అభిమానుల్లో, ఇటు ప్రేక్షకుల్లో భీమ్లా నాయక్ చిత్రంపై కనీవినీ ఎరుగని అంచనాలు ఉన్నాయి. కేవలం ప్రీ సేల్స్ తోనే యుఎస్ లో భీమ్లా వసూళ్లు 700K డాలర్లకి సమీపంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ రేంజ్ లో భీమ్లా నాయక్ మ్యానియా సాగుతోంది.
