Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ మంచి కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కుటుంబం పరువుతో కూడిన కాన్సెప్ట్ తో ఈ సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు ఫిబ్రవరి 17వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.. 

 ఈరోజు ఎపిసోడ్ లో గోవిందరాజులు బయట పడుకోవడానికి చాప పరుస్తూ ఉండగా ఇంతలో అక్కడికి జ్ఞానాంబ వస్తుంది. ఏంటండీ నేను మీకోసం వెతుకుతుంటే మీరు ఇక్కడ బయట చాప పరుస్తున్నారు ఎవరి కోసం అనడంతో పిల్లలందరినీ దూరంగా పెట్టావు కదా అలాగే నన్ను కూడా వెళ్లిపోమంటావేమో అనడంతో ఇన్నేళ్లు నాతో కాపురం చేశారు మీరు కూడా ఇదేనా నన్ను అర్థం చేసుకున్నది అని అంటుంది జ్ఞానాంబ. ముందు మీరు లోపలికి పదండి నేను చెప్తాను అనడంతో పర్లేదులో జ్ఞానం అనగా, నేను చెప్పేది మీ వినండి అయినా మీకు తప్పు అనిపిస్తే మీరు ఏ శిక్ష వేసిన నేను భరిస్తాను అంటుంది జ్ఞానాంబ.

ఇప్పుడు మీకు ఎందుకు కోపం వచ్చింది అనగా నువ్వు రామచంద్ర జానకి తో మాట్లాడిన మాటలు అన్నీ నేను విన్నాను అంటాడు గోవిందరాజులు. రామచంద్ర కలిసి ఉందామని అంత బ్రతిమలాడినా నువ్వు అంత కఠినంగా మాట్లాడావు అనడంతో కావాలని మాట్లాడాను అని అంటుంది. అంత కఠినంగా మాట్లాడాల్సిన అవసరం ఏముంది అని గోవిందరాజులు అడగగా ఇంటి నుంచి వెళ్లిపోవాలి అనుకున్నప్పుడే వారి సమస్య ఏదో నీకు తెలియదా.. ఇకపోతే మనం చిన్నవాడి నుంచి మొదలుపెడదాము వాడి జీతం ఎంత అండి అనడంతో ఎంత 15వేలు అనడంతో కాదు వాడి జీతం 30వేలు అనడంతో గోవిందరాజులు షాక్ అవుతాడు. నిజమా అని అనడంతో ఇందాకే నాక్కూడా తెలిసింది.

 అయిన అబద్ధం చెప్పాల్సిన అవసరం మనకి ఏముంది జ్ఞానం అనడంతో జీతం విషయంలోనే వాడు ఇంత అబద్ధాలు ఆడాడు అంటే జీవితం విషయంలో ఇంకెన్ని అబద్ధాలు వాడుతాడు అనగా అయినా చిన్నోడు ఇలా మారిపోయాడు. విష్ణుని చూసి నేర్చుకోమను అనడంతో అప్పుడు జ్ఞానాంబ చిన్న నవ్వు నవ్వి విష్ణు కూడా తక్కువ ఏం కాదండి అని అంటుంది. ఆ షాపు వాళ్ళ ఫ్రెండ్ ది కాదు వాడిదే అనడంతో గోవిందరాజులు షాక్ అవుతాడు. మనకు తెలియకుండా దాచిన డబ్బుతో ఆ షాప్ పెట్టాడు అని అనడంతో గోవిందరాజులు షాక్ అవుతాడు. మన బిడ్డలు ఇలాంటి వారా అనడంతో అది వాళ్ల పట్ల వారు తీసుకుంటున్న జాగ్రత్త అని అంటుంది. నిజం చెప్తే ఎక్కడ అప్పు తీర్చాల్సి వస్తుందో అని మనకు అబద్ధం చెప్పారు అంటుంది జ్ఞానాంబ.

అందుకె మల్లిక కూడా అనవసరంగా జానకి మీద దొంగ అనే ముద్ర వేసి బయటికి వెళ్లిపోవాలని చూసింది అని అంటుంది. అన్నీ నిజాలు తెలిసి మరి ఇలా ఎందుకు మౌనంగా ఉన్నావు జ్ఞానం అనడంతో అలాంటి వారిని నిడదీసిన వేస్ట్ అని ఉంటుంది జ్ఞానాంబ. మనం పెద్దవాళ్లుగా వాళ్ళ తప్పులు వాళ్లకు తెలిసేలా చేయడం అనడంతో గోవిందరాజులు ఆలోచనలో పడతాడు. నువ్వు ఇలాంటి ఆలోచన చేస్తావని అనుకోలేదు జ్ఞానాంబ నేను తప్పుగా అపార్థం చేసుకున్నాను అంటాడు గోవిందరాజులు. ఆ తర్వాత విష్ణు మల్లిక గదిలోకి వెళ్ళగా అప్పుడు మల్లిక విష్ణు వైపు కోపంగా చూస్తూ మీ అమ్మ నాన్నల కోసం ఐదు వేల రూపాయలు ఇస్తారా అని అంటుంది.

అప్పుడు ఇలా ఇచ్చుకుంటూ పోతే మనం ఆస్తి అమ్ముకోవాల్సి వస్తుంది అంటూ విష్ణు మనసుని చెడగొడుతుంది మల్లిక. మరొకవైపు రామచంద్ర హమ్మయ్య తమ్ముల్లిద్దరు సరే అని చేతులు కలిపేశారు అనడంతో వెంటనే జానకి మంచి పనికి ఎప్పుడు చేతులు కలుస్తాయండీ అని అంటుంది. ఆ తర్వాత జానకి పడుకోగా రామచంద్ర మాట్లాడుతూ ఆ మల్లెపూల వాసన చూసి మాట్లాడడానికి తడపడుతూ ఉంటాడు. అప్పుడు రామచంద్ర జానకి గారు మీరు అట్లా తిరిగి పడుకోండి అనడంతో జానకి నవ్వుకుంటూ ఉంటుంది. అప్పుడు రామచంద్ర మల్లెపూల వాసన చూస్తూ జానకితో మాట్లాడ్డానికి ఇబ్బంది పడుతూ ఉంటాడు. అప్పుడు రామచంద్ర టెన్షన్ టెన్షన్ గా మాట్లాడక జానకి నవ్వుకుంటూ ఉంటుంది.

 తర్వాత జ్ఞానాంబ నిద్ర లేస్తుంది. అప్పుడు కిచెన్లోకి వెళ్ళగా అప్పుడు జానకి ఒకవైపు చదువుకుంటూనే మరోవైపు వంట చేస్తూ ఉండగా అది చూసి జ్ఞానాంబ సంతోష పడుతూ ఉంటుంది. ఆ తర్వాత జానకి రెడీ అవుతుండగా ఇంతలో జెస్సి, మల్లిక కూడా అక్కడికి వస్తారు. జానకి అత్తయ్య గారి దగ్గరికి వెళ్దాం పదండి అనడంతో అత్తయ్య గారు వద్దు అన్నారు కదా ఇప్పుడు చేయడం అవసరమా అని అంటుంది మల్లిక. అత్తయ్య గారు ఒప్పుకోరు అని నాకు తెలుసు అలా అనుకోవద్దు మల్లిక అందరూ కలిసి ఒప్పిస్తే ఒప్పుకుంటారు అని అంటుంది జానకి. అప్పుడు అత్తయ్య గారు ఒప్పుకోకపోయినా ఒప్పించేంత వరకు మనం కష్టపడాల్సిందే అంటుంది జానకి. ఆ తర్వాత జానకి మల్లిక,జెస్సి ముగ్గురు కలిసి జ్ఞానాంబ దగ్గరికి వెళ్తారు

 మరోవైపు రామచంద్ర,అఖిల్,విష్ణు ముగ్గురు కలిసి గోవిందరాజులు కి శుభాకాంక్షలు చెప్పి పట్టు పంచే అంగీ టవల్ కానుకగా ఇస్తారు. మరోవైపు జానకి వాళ్ళు జ్ఞానాంబకు చీరను బహుమతిగా ఇస్తారు. అప్పుడు రామచంద్ర గోవిందరాజులని ఒప్పించగా జానకి జ్ఞానాంబనీ ఒప్పిస్తుంది. ఆ తర్వాత జ్ఞానాంబ గోవిందరాజులు పిల్లలు ఇచ్చిన బట్టలను సంతోషంగా తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అప్పుడు అందరూ కలిసి సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు.